»   » మెగా హీరోలకోసం మెగా స్కెచ్చేసిన ప్రొడ్యూసర్...!?

మెగా హీరోలకోసం మెగా స్కెచ్చేసిన ప్రొడ్యూసర్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బృందావనం", 'మిస్టర్ ఫెర్ ఫెక్ట్" సినిమాల్తో పూర్వ వైభవం తెచ్చుకోకపోయినా మళ్లీ విజయాల భాట పట్టిన దిల్ రాజు ఇప్పుడు పావులు వేగంగా కదుపుతున్నాడు. ీ ఊపులోనే నాలుగైదు భారీ సినిమాలు ఓకే చేసుకుని నంవర్ వన్ ప్రొడ్యూసర్ అనిపించుకోవాలని చూస్తున్నాడు. హిట్స్ లో ఉన్నాడు కాబట్టి తనతో సినిమా చేయడానికి ప్లాపుల్లో ఉన్న హీరోలెవరూ కాదని చెప్పరని తెలుసు కాబట్టి ఇదే అదనుగా మెగా హీరోలు అల్లు అర్జున్, చరణ్ ల కోసం దిల్ రాజు స్కెచ్ రెడీ చేశాడు.

పైడిపల్లి వంశీతో చరణ్ కి కథ చెప్పించిన దిల్ రాజు, అలాగే అల్లు అర్జున్ కీ ఓ కథ వినిపించాడట. ఈ రెండు కథలకి ఇద్దరు యువ మెగా హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కథల కంటే వారికి ప్రస్తుతం దిల్ రాజు హ్యాండు బాగుందనే నమ్మకం కుదరడం వల్లే ఆ సినిమాలు చేయడానికి అంగీకరించారని సినీ జనం అనుకుంటున్నారు. మరో విషయం ఏమిటంటే ఇప్పటి తన విజయాల్నిఆసరాగా చేసుకుని ఇద్దరు హీరోలని కలిపి ఒక మల్టీస్టారర్ తీయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడట దిల్ రాజు.

English summary
Stylish Star Allu Arjun and producer Dil Raju has earlier worked for a couple of films Arya and Parugu that scored well at the Box-Office. The latest buzz is they are teaming up yet again for the third film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu