Dil Raju కొడుకు కోసం హీరో శర్వానంద్‌కు ఝలక్ ఇచ్చిన దిల్ రాజు... అసలు ఏమైందంటే ?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఆయనకు స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ ఉంది. ఆయన ఓ మాట చెబితే చాలు చాలా మంది వినేవారు ఉంచారు . కెమెరాలు కూడా ఆయన చేసే ప్రతీ పనిని బాగా పోకస్ చేస్తుంటాయి. అయితే ఆయన తన ఇండస్ట్రీ వారసుడిగా తన సోదరుడి కుమారుడు ఆశిష్‌ను హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అతడిని సినీ కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఆశిష్ కోసం మరో యంగ్ హీరో శర్వానంద్‌కు ఓ షాకింగ్ ఝలక్ ఇచ్చారు! దాని గురించి పూర్తి వివరాలను స్టోరిలోకి వెళ్లి తెలుసుకుందాం...
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం దాదాపుగా వారసులతో నిండిపోతోంది. ఓ ఇద్దరు ముగ్గురు మినహా చాలా మంది బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోలే ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి అయితే ఏకంగా ఓ క్రికెట్ టీమే దిగింది. అయితే దర్శకులు, నిర్మాతల వారసులు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు. అయితే తన ఫ్యామిలీ నుంచి కూడా ఇండస్ట్రీలో ఓ వారసుడు ఉండాలని భావించిన దిల్ రాజు
తన సోదరుడు శిరీష్ తనయుడు ఆశీష్ రెడ్డిని హీరోగా చేశాడు. ఇప్పటికే అతడు రౌడీబాయ్ చిత్రంతో తెరంగేట్రం చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.

దీంతో ఆశిష్ రెండో చిత్రం కోసం తనే స్వయంగా రంగంలోకి దిగారు దిల్ రాజు. సెల్ఫిష్ అనే చిత్రాన్నితానే దగ్గరుండి మరీ చూసుకుంటూ తెరకెక్కించారు. ఇది త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా అతడి పెళ్లిని కూడా గ్రాండ్‌గా చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీలను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ అంగరంగ వైభవంగా చేశారు. ఇదిలా ఉంటే ఇక ఆశిష్ మూడో చిత్రం విషయంలో దిల్ రాజు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారని తెలిసింది. దీని కోసం శర్వానంద్ హిట్ సినిమాను వాడుకోనున్నట్లు తెలిసింది.
శర్వానంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంటే శతమానంభవతి అని చెప్పాలి. నేషనల్ అవార్డు అందుకుందీ చిత్రం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమలు, ఆప్యాయతలు, తల్లిదండ్రుల ప్రేమ, పెద్దల కోసం తమ ప్రేమను వదులుకునేందుకు సిద్ధపడిన అద్భుతమైన ప్రేమ జంట.. ఇలా ఎన్నో ఎలిమెంట్స్‌ను బాగా చూపించారు. ఇంకా చెప్పాలంటే అచ్చ తెలుగు సంక్రాంతికి మరో అర్ధమే ఈ సినిమా అనేలా తెరకెక్కించారు.

ఇందులో శర్వానంద్ అనుపమ సహా ఇతర నటీనటుల నటన, స్టోరీ ఎమోషన్స్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజునే నిర్మించారు. 2017 సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అయితే దీనికి దాదాపు ఏడేళ్ల తర్వాత సీక్వెల్ ప్రకటించారు దిల్ రాజు. దీనిని కూడా సతీష్ వేగేశ్ననే తెరకెక్కిస్తున్నారు. కానీ నటీనటులు ఎవరనేది చెప్పలేదు.
దీంతో చాలా మంది మళ్లీ శర్వానందే నటించాలని ఆశించారు. శతమానంభవతి సినిమా అంటే శర్వ, శర్వ అంటే శతమానంభవతి అనే రేంజ్లో ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయిందీ సినిమా. అయితే ఈ మధ్య అందిన సమాచారం ప్రకారం శర్వ ఈ సీక్వెల్లో భాగస్వామ్యం కావట్లేదని తెలిసింది. అయినా అతడే కావాలని మరో హీరో తమకొద్దని చాలా మంది అన్నారు. కానీ తాజాగా అందుతున్న సమచారం ప్రకారం సీక్వెల్లో తన వారసుడు ఆశిష్ టైటిల్ రోల్ పోషించేలా దిల్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ టాపికే ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తన వారసుడు కోసం శర్వానంద్‌కు దిల్ రాజు ఝలక్ ఇచ్చాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో


Click it and Unblock the Notifications











