తక్కువ పెట్టుబడులు.. ఎక్కువ లాభాలు, పాత ఫార్ములతో దిల్ రాజు సరికొత్త ప్లాన్
ఇండస్ట్రీలో సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ బిజినెస్ చేసేలా ఉంటాయి. దిల్, ఆర్య, కొత్త బంగారు లోకం వంటి సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందినవే. వాటి వల్లే రాజు గారి బ్రాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక బొమ్మరిల్లు లాంటి సినిమాకు కూడా చాలా తక్కువ ఖర్చు పెట్టిన ఆయన పెట్టుబడికి పదింతల లాభాన్ని అందుకున్నాడు.
ఇక అవకాశం వచ్చినా ప్రతిసారి స్టార్ హీరోలతో కూడా కమర్షియల్ యాంగిల్ లో పెద్ద సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే దిల్ రాజుకు ఎక్కువగా లాభాలను అందించింది మాత్రం చిన్న సినిమాలనే చెప్పాలి. ఆ మధ్య వచ్చిన శతమనం భవతి కూడా అలాంటిదే. అయితే చాలా కాలం తరువాత మళ్ళీ ఆయన పాత ఫార్ములలో పూర్తిగా కొత్త వారితోనే సినిమాలను నిర్మించాలని చూస్తున్నట్లు టాక్.

ముగ్గురు కొత్త దర్శకులు చెప్పిన కథలపై పాజిటివ్ గా ఉన్న దిల్ రాజు సమ్మర్ అనంతరం వాటిని సెట్స్ పైకి తేనున్నట్లు టాక్. ఇక అందులో ఒక సినిమా పూర్తిగా కొత్త వారితోనే రూపొందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దిల్ రాజు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రిలీజ్ కు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే F3ని కూడా స్టార్ట్ చేశారు. ఇక వాటి తరువాత మాత్రం
వీలైనంత వరకు చిన్న బడ్జెట్ లోనే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నారట. మరి ఆ సినిమాలతో ఎంతవరకు లాభాలను అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











