దిల్ రాజు ఇంకోటి మొదలెట్టాడు

ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్టైన చిత్రం కలిసి ఉంటే కలదు సుఖం. ఈ టైటిల్ తో ఇప్పుడు మరో చిత్రం రూపొందుతోంది. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్(ఓ మై ప్రెండ్) దర్శకుడుగా రూపొందుతోంది. అల్లు అర్జున్ కానీ నితిన్ కానీ ఈ చిత్రంలో నటించే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి స్క్రిప్టు వర్క్ పూర్తైందని, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని రూపొందించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కుతోందని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు మొదలయ్యాయని అంటున్నారు.
దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం ఓ లవ్ స్టోరీగా ఉండనుందని,వైవిధ్యమైన స్క్రీన్ ప్లే తో వేణు శ్రీరామ్ కథనాన్ని తయారు చేసాడని చెప్తున్నారు. ఈ మేరకు గత కొంతకాలంగా వేణు ఈ స్క్రిప్టుపైనే కుస్తీలు పడుతున్నారు. లైన్ ఓకే చేసిన బన్ని రీసెంట్ గా పూర్తి స్క్రిప్టు విన్నారని, తెలుస్తోంది. త్రివిక్రమ్ తో చేయనున్న ప్రాజెక్టు అనంతరం ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. వేణు శ్రీరామ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న కేరింత చిత్రంకి సహాయం చేస్తున్నారు.
'వినాయకుడు' తో తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు సాయి కిరణ్ అడవి కొత్త చిత్రం 'కేరింత'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మై డ్రీం సినిమా బ్యానర్ ఫై దిల్ రాజు, సాయి కిరణ్ అడవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కి జే మేయర్ ను ఎంపిక అయ్యారు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కొత్తవాళ్లు నటిస్తారు. ఇందుకోసం స్టార్ హంట్ నిర్వహించారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ''కుర్రకారు మనోభావాల్ని ఆవిష్కరించే కథ ఇది. సాయికిరణ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. రచయిత అబ్బూరి రవితో కలిసి ఆ కథని మరింత బాగా తీర్చిదిద్దాం. ఈ చిత్రంతో కొద్దిమంది సాంకేతిక నిపుణులను కూడా పరిచయం చేస్తున్నాం.''అని తెలిపారు.
సాయికిరణ్ అడవి మాట్లాడుతూ... ''ఈ కథపై ఎప్పట్నుంచో కసరత్తులు సాగుతున్నాయి. అబ్బూరి రవి మాతో కలవగానే కథ కొత్తరూపం సంతరించుకొంది'' అన్నారు. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. ఎడిటర్ గా మధు, సినిమాటోగ్రాఫర్ గా విశ్వ, కొరియోగ్రాఫర్ గా విజయ్ ని ఈ మూవీతో పరిచయం చేస్తున్నారు.
''ఇదివరకు మా సంస్థలో చిన్న సినిమాల్ని తెరకెక్కించాం. కొంతకాలంగా స్టార్ హీరోల చిత్రాలకే పరిమితమయ్యాం. ఐదేళ్ల తర్వాత మళ్లీ 'కేరింత' పేరుతో ఓ చిన్న చిత్రాన్ని మొదలుపెడుతున్నాం'' అన్నారు దిల్‌రాజు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: విశ్వ, కూర్పు: మధు, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











