‘శీనయ్య’ ఇప్పట్లో వచ్చేలా లేడు.. మళ్లీ మొదటికి వచ్చిన సీన్

మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు వివి వినాయక్. ఎన్నో బ్లాక్ బస్టర్‌లను అందించిన వివి వినాయక్.. గత కొంత కాలం నుండి డిజాసర్ట్లను అందించసాగాడు. అఖిల్, ఇంటెలిజెంట్ వంటి దారుణమైన సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. అలాంటి దర్శకుడు కొత్త అవతారం ఎత్తాడు. హీరోగా మారి 'శీనయ్య'లా రాబోతోన్నాడు.

శీనయ్య సినిమాకు సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ కోసమని వినాయక్ కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. పాత్రకు తగ్గట్టు భారీగానే తగ్గి స్లిమ్‌గా మారాడు. అయితే ఇంతా చేస్తే కథ, కథనం మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అన్నట్టే ఉందట. ఈ మూవీ స్క్రిప్ట్‌పై యూనిట్ తర్జనభర్జనలు పడుతోందని టాక్.

Dil raju Not Satisfied with Seenayya Script

శీనయ్య లైన్‌ను పట్టుకుని, పూర్తి స్క్రిప్ట్ గా మార్చేటప్పుడు ఎలాగూ తను కూడా దర్శకుడు అని వివి వినాయక్‌ను కూడా ఇన్వాల్వ్ చేసినట్లు టాక్. అలా ఆ స్క్రిప్ట్ పూర్తిగా ఆయన తన స్టైల్‌కు తగ్గట్టు, తన ఆలోచనలకు అనుగుణంగా మార్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ దిల్ రాజుకు అంతగా నచ్చలేదని దాంతో మళ్లీ తన ఆస్థాన రచయితలతో కొత్త స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నట్లు సమాచారం. మరి అదెప్పుడు పూర్తవుతుందో.. శీనయ్య ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X