Don't Miss!
- Sports SRH vs RCB: ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ప్యాట్ కమిన్స్
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దిల్ రాజు మైండ్ లో జాతిరత్నం.. బంపర్ ఆఫర్!
సినిమా ఇండస్ట్రీలో కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి అంటారు. అలాగే ఎన్నో ఏళ్ల ఓపిక కూడా ఉండాలి. విజయ్ దేవరకొండతో పాటు పదేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చూస్తున్న నవీన్ పొలిశెట్టి మొత్తానికి మొదటి బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. జాతిరత్నాలు సినిమాలో లీడ్ రోల్ లో నటించి మొత్తానికి తన అసలైన టాలెంట్ ను నిరూపించుకున్నాడు.
ఇక ఇప్పుడు నవీన్ పొలిశెట్టి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతోంది. బడా నిర్మతల నుంచి అగ్ర దర్శకుల వరకు అతని హార్డ్ వర్క్ ను చూసి ఫిదా అవుతున్నారు. ఇక నిర్మాతలు అలవాటు ప్రకారం అడ్వాన్స్ లు ఇవ్వడబికి రెడీ అవుతున్నారు. ఇక లక్కీగా నవీన్ పొలిశెట్టి మరో అగ్ర నిర్మాత దృష్టిలో పడ్డట్లు తెలుస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో నవీన్ కు ఆఫర్ వచ్చినట్లు టాక్ అయితే వైరల్ అవుతోంది.
ఇంకా ఈ విషయంలో అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ రాలేదు. నవీన్ రెగ్యులర్ ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పటికి ఎక్కడా కూడా లీక్ చేయడం లేదు. నిర్మాతల నుంచి అఫీషియల్ న్యూస్ వస్తేనే బావుంటుందని అంటున్నాడు. ఇక దిల్ రాజు దగ్గర నిత్యం కొత్త దర్శకులు స్టోరీలతో రెడీగా ఉంటారని అందరికి తెలిసిందే. అయితే ఫైనల్ గా ఒక కథ నవీన్ కు కరెక్ట్ సెట్టవుతుందని ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.