For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR నిర్మాతతో దిల్ రాజు డీల్: దానయ్య ముందు భారీ ఆఫర్.. ‘బాహుబలి’ కంటే మూడు రెట్లు.!

  By Manoj
  |

  టాలీవుడ్‌లోనే ఇప్పుడున్న బడా ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆయన 'దిల్' సినిమాతో నిర్మాతగా మారారు. ఈ సినిమాతో పాటు ఆయన నిర్మించిన మొదటి నాలుగు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ సమయంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బడా ప్రొడ్యూసర్ అయిపోయారు. ఓ వైపు సినిమాలు నిర్మిస్తూ.. మరోవైపు బడా హీరోల చిత్రాలను పంపిణీ చేస్తున్నారాయన. ఈ నేపథ్యంలో దిల్ రాజు ప్రతిష్మాత్మక చిత్రం RRR నిర్మాత ముందు భారీ ఆఫర్ ఉంచారని ఓ వార్త లీక్ అయింది. ఇంతకీ ఏంటా డీల్.? వివరాల్లోకి వెళితే...

  ఆయన మనసు పడితే హిట్ అయినట్లే

  ఆయన మనసు పడితే హిట్ అయినట్లే


  దిల్ రాజు.. స్టార్ డైరెక్టర్లతోనే కాదు.. మంచి కథలతో వచ్చిన ఎంతో మంది కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించారు. వీలైతే సినిమాలు నిర్మించడం.. లేకుంటే వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ సక్సెస్ అవుతున్నారు. దిల్ రాజు ఓ సినిమాపై మనసు పడ్డారంటే అది కచ్చితంగా హిట్ అవుతుంది అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అంతలా ఆయన ప్రభావం చూపిస్తూ వస్తున్నారు.

  రెండు సినిమాలూ హిట్టే.. కోట్లలో లాభాలు

  రెండు సినిమాలూ హిట్టే.. కోట్లలో లాభాలు

  2020 ప్రారంభంలోనే దిల్ రాజు భారీ విజయాలను అందుకున్నారు. మహేశ్ - అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు'కు సహా నిర్మాతగా వ్యవహరించిన ఆయన.. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మూవీ ‘అల.. వైకుంఠపురములో' నైజాం ఏరియా రైట్స్‌ను దక్కించుకున్నారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో పాటు ఆయనకు కోట్లలో లాభాలను తెచ్చి పెట్టాయి.

  పవన్ కల్యాణ్ విషయంలో ఇది ఊహించలేదు

  పవన్ కల్యాణ్ విషయంలో ఇది ఊహించలేదు

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత.. ఆయనతో రీఎంట్రీ ఇప్పించాలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నాలు చేశారు. అయితే, ఎవరికీ సాధ్యం కాని దానిని దిల్ రాజు సుసాధ్యం చేసి చూపించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ చిత్రం ‘పింక్'కు రీమేక్‌గా ఈ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే.

   దిల్ రాజు కన్ను RRRపై పడిందంటున్నారు

  దిల్ రాజు కన్ను RRRపై పడిందంటున్నారు

  ప్రస్తుతం తెలుగులోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా 2021 జనవరి 8న విడుదల కాబోతుంది. సంక్రాంతి సీజన్‌కు వస్తుండడంతో ఈ సినిమా హక్కులపై దిల్ రాజు కన్నేశారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

  దానయ్యకు భారీ ఆఫర్.. ‘బాహుబలి' కంటే మూడు రెట్లు

  దానయ్యకు భారీ ఆఫర్.. ‘బాహుబలి' కంటే మూడు రెట్లు

  నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు.. RRR సినిమా ఆ ప్రాంతం హక్కుల కోసం నిర్మాత డీవీవీ దానయ్యతో డీల్ మాట్లాడారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. గతంలో విడుదలైన ‘బాహుబలి 2'ను రూ. 25 కోట్లకు దక్కించుకున్న ఆయన.. ఈ సినిమాకు ఏకంగా రూ. 76 కోట్లు ఆఫర్ చేశారని సమాచారం. దీనిపై దానయ్య నుంచి స్పందన రావాల్సి ఉందని టాక్.

   RRR మూవీ రేంజ్‌కు ఈ ఫిగర్లే నిదర్శనం

  RRR మూవీ రేంజ్‌కు ఈ ఫిగర్లే నిదర్శనం

  టాప్ డైరెక్టర్.. ఇద్దరు స్టార్ హీరోలు.. భారీ బడ్జెట్ మూవీ కావడంతో RRR సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఉంది. ఇప్పటికే ఈ చిత్ర ఈస్ట్ గోదావరి రైట్స్‌ను ఓ సంస్థ రూ. 13 కోట్లకు కొనుగోలు చేసిందని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇప్పుడు దిల్ రాజు ఆఫర్ లీక్ అయింది. అంటే RRR క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

  English summary
  RRR is an upcoming 2021 Indian Telugu-language period action film written and directed by S. S. Rajamouli. It stars N. T. Rama Rao Jr., Ram Charan, Alia Bhatt and character actor Ajay Devgn.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X