RC15: శంకర్ లెక్కలకు ఆలోచనలో పడిన దిల్ రాజు.. ఆ భారం తట్టుకోలేక మరో కీలక నిర్ణయం!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తరువాత కూడా మరిన్ని పాన్ ఇండియన్ సినిమాలను లైన్ లో పెట్టాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే సంచలన దర్శకుడు శంకర్ తో ఒక సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. యాక్షన్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

తప్పకుండా రామ్ చరణ్ మరొక పాన్ ఇండియా సినిమాతో తన మార్కెట్ ను అమాంతంగా పెంచుకుంటాడాని అనిపిస్తోంది. అయితే శంకర్ బడ్జెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ఆయన లెక్కలకు నిర్మాత దిల్ రాజు మళ్ళీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

పాన్ ఇండియా మార్కెట్ పెరిగేలా..

పాన్ ఇండియా మార్కెట్ పెరిగేలా..

దర్శకధీరుడు రాజమౌళి తో RRR సినిమా పూర్తి చేసిన రామ్ చరణ్ తేజ్ ఆ సినిమాతో తప్పకుండా సోలోగా మల్టీస్టారర్ మార్కెట్ ను సొంతం చేసుకుంటాడు అని చెప్పొచ్చు. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ కూడా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో మార్కెట్ అయితే ఉంది. తప్పకుండా సినిమా పాన్ మార్కెట్ ను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.

బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా

బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా

రామ్ చరణ్ తేజ్ అయితే చాలా నెమ్మదిగా మంచి సినిమాలను చేయాలని అనుకుంటున్నాడు. తొందర పడకుండా గతంలో మాదిరిగా మళ్లీ అపజయాలను చూడవద్దని ఆలోచిస్తున్నాడు. ఇక శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాతో రామ్ చరణ్ తేజ్ సోలో మార్కెట్ ఇంకా భారీ స్థాయిలో పెరుగుతుందని అర్థమవుతుంది. ఈ సినిమా కోసం దర్శకుడు శంకర్ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బడ్జెట్ విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు.

దిల్ రాజు తట్టుకోగలడా?

దిల్ రాజు తట్టుకోగలడా?

దిల్ రాజు ప్రొడక్షన్లో శంకర్ ఎప్పటినుంచో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అనుకోని కారణాలవల్ల ఇండియన్ 2 క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు RC 15 ప్రాజెక్టును తెర పైకి తీసుకు వచ్చే అవకాశం వచ్చింది. అయితే ఈ కాంబినేషన్ పై అంచనాలు బాగానే ఉన్నప్పటికీ మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి శంకర్ ఆ స్థాయిలో బడ్జెట్ ను తట్టుకోగలడా అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. కానీ దిల్ రాజు మాత్రం పక్కా ప్రణాళికలతోనే రామ్ చరణ్ శంకర్ సినిమాలను నిర్మిస్తున్నాడు.

పోస్టర్ కోసమే 73లక్షలు

పోస్టర్ కోసమే 73లక్షలు

శంకర్ సాధారణంగా ప్రతి సన్నివేశాన్ని వెండితెరపై అద్భుతంగా చూపించాలని అనుకుంటాడు. పెట్టిన ప్రతి పైసా కూడా తెరపై కనిపించేలా చేస్తాడు. అయితే పోస్టర్స్ కోసమే 73 లక్షల వరకు ఖర్చు చేయించిన ఈ దర్శకుడు మిగతా సన్నివేశాలకు కూడా భారీ స్థాయిలో బడ్జెట్ లాక్ చేసినట్లు సమాచారం. ఇక ట్రైన్ ఫైట్ కోసం అయితే దాదాపు పది కోట్ల వరకు ఖర్చు చేయించినట్లు తెలుస్తోంది.

Recommended Video

105 Minutes Movie Official Teaser || Hansika Motwani
మరో సంస్ధతో కలిసి

మరో సంస్ధతో కలిసి

శంకర్ గురించి ముందే తెలిసినప్పటికీ కూడా దిల్ రాజు సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అంటే పక్కా ప్రణాళికలతోనే అగ్రిమెంట్ సెట్ చేసుకున్నాడని అందరూ అనుకున్నారు. అయితే ప్రస్తుతం బడ్జెట్ మాత్రం అనుకున్న దానికంటే కాస్త ఎక్కువగా వెళుతుండటంతో మరొక సంస్థతో సంయుక్తంగా సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

జి స్టూడియోస్ దిల్ రాజుతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇద్దరు కలిసి శంకర్ రామ్ చరణ్ సినిమాను అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ తో నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ కాంబినేషన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X