ఎన్టీఆర్ సినిమాకు నిర్మాత మార్పు
ఎన్టీఆర్,హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఎమ్మల్యే అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మొదట కొడాలి నాని నిర్మాత అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దిల్ రాజు సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గుడివాడ టిడీపి ఎమ్మల్యే నాని చేస్తాడనుకున్న ఈ ప్రాజెక్టుని దిల్ రాజు టేకొవర్ చేసుకుంటాడని వినిపిస్తోందిం. రాజకీయపరమైన విభేదాలుతోనే ఆ ప్రాజెక్టు చేతులు మారుతోందని చెప్పుకుంటున్నారు.
ఇక చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రం స్క్రీన్ ప్లే ఇప్పటికీ పూర్తి చేసారు. పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే మేకర్స్ ఈ విషయాన్ని నిర్దారించలేదు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చిత్రం ఉంటుందని చెప్తున్నారు. సెప్టెంబర్ నుంచి చిత్రం మొదలవుతుంది. ఈ లోగా ఎన్టీఆర్ బాధ్షా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని వస్తారు. గతంలో దిల్ రాజు,ఎన్టీఆర్ కాంబినేషన్ లో బృందావనం చిత్రం వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు సరిపోయే ఓ విభిన్నమైన మాస్ ఎంటర్‌టైనర్ కథను హరీష్ సిద్ధం చేశాడని చెప్తున్నారు. ఇటీవల ఈ కథను విన్న ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ముఖ్యంగా మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ అన్ని హరీష్ కూర్చి ఈ కథను జన రంజకంగా తెరకెక్కించనున్నాడని టాక్. ఎమ్మల్యే అంటే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని చెప్తున్నారు.
మరో ప్రక్క ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'బాద్‌షా' చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటలీలో మొదలుకానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత బండ్ల గణేష్‌బాబు తెలియజేస్తూ' యాక్షన్‌తో అంశాలతో పాటు ఓ అందమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో వుంది. ఈ చిత్రంలో శ్రీనువైట్ల కొత్త ఎన్టీఆర్‌ను చూపించబోతున్నాడు. ఆయన ఇమేజ్, శారీరక భాషకు సరిగ్గా సరిపోయే కథ. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఆశిస్తున్న అంశాలు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇంతకు ముందు 'అదుర్స్' చిత్రంలో తన కామెడీ టైమింగ్‌తో అందర్ని నవ్వించిన ఎన్టీఆర్ ఈ చిత్రంలో ప్రేక్షకులను మరింతగా అలరించనున్నాడు. ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రను ఆయన ఇందులో చేస్తున్నాడు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ మెప్పు పొందుతుందనే విశ్వాసం వుంది' అన్నారు.


Click it and Unblock the Notifications











