దిల్ రాజు నిర్మాతగా పవన్ చిత్రం
దిల్ రాజు ప్రస్తుతం భారీ బడ్జెట్ లతో టాలీవుడ్ స్టార్ హీరోలతో వరస సినిమాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో చేయాలన్నది ఆయన చిరకాల కల. రెండు మూడు సార్లు ఆయన స్టేజి మీద బహిరంగంగా ఆ కోరకను పవన్ సమక్షంలో వెల్లబుచ్చారు కూడా. అయితే పవన్ అంగీకారం తెలిపి డేట్స్ ఇవ్వటం జరగలేదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ..దిల్ రాజు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే డైరక్టర్ ఎవరు...మిగతా తారాగణం ఏమిటన్నది ఫైనలైజ్ కాలేదని సమాచారం.
ఇక ప్రస్తుతం పవన్ దృష్టి మొత్తం గబ్బర్ సింగ్ రిలీజ్ పైనే ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 11న విడుదల అవుతోంది. బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ఇక్కడ పరిస్దితులకు అణుగుణంగా లోకలైజ్ చేసి స్క్రిప్టు రెడీ చేసి తెరకెక్కించారు. ముఖ్యంగా పవన్ చేత చెప్పించే పంచ్ డైలాగులు ఈ సినిమాకు ప్రాణం అంటున్నారు. మరో ప్రక్క ఈ చిత్రంలోని ఐటం సాంగ్ కెవ్వు కేక ఇప్పటికే అంతటా కేక పెట్టిస్తోంది.
దిల్ రాజు విషయానికి వస్తే ఆయన వరసగా రామ్ చరణ్ తో ఎవడు,మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చేస్తున్నారు. ఎవడు చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తూంటే ...సిరిమల్లె చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేస్తున్నారు. వీరిద్దరూ దిల్ రాజు క్యాంపస్ నుంచి వచ్చిన వారే కావటం విశేషం. అలాగే రామ్ చరణ్ చిత్రంలో గెస్ట్ గా అల్లు అర్జున్ చేస్తూంటే,మహేష్ చిత్రంలో అతని అన్నగా వెంకటేష్ చేస్తున్నారు. ఇలా క్రేజీ కాంబినేషన్ తో ఈ చిత్రాలు రూపొందిస్తూ ట్రేడ్ లో అంచనాలు విపరీతంగా పెంచుతున్నారు.
ఈ నేపధ్యంలో పవన్ తో సినిమా అనగానే గ్యారెంటీగా దిల్ రాజు క్యాంపస్ లోని దర్శకుడు అయ్య అవకాసం ఉందంటున్నారు. అంతేగాక ఈ చిత్రానికి ఏయే కమర్షియల్ హంగులు అద్దాలా అనేది ఇప్పటికే దిల్ రాజు మదిలో ప్లాన్స్ ఉండనే ఉంటాయంటున్నారు. అయితే దిల్ రాజు సినిమా అంటే పక్కా స్క్ర్రిప్టుతో వెళతాడు...అదీ దిల్ రాజు కు నచ్చే స్క్రిప్టు అని పేరు ఉంది. పవన్ ది అదే స్కూల్..తను చేసే సినిమా స్క్రిప్టుని తనే దగ్గరుండి చేయించుకుంటాడు. తన బాడీ లాంగ్వేజి కి తగ్గట్లుగా సినిమాని రూపొందించుకోవటంలో పవన్ సిద్దహస్తుడు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం అంటే ఎలా ఉండనుందో అని ఫిల్మ్ వర్గాల్లో అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











