సీన్ లోకి దిల్ రాజు...కాబట్టి నో ప్లాబ్లం

By Srikanya

హైదరాబాద్ : దిల్ రాజు ఓ సినిమాని నిర్మిస్తున్నాడంటే ఆ సినిమాకు వచ్చే క్రేజే వేరు. ఎందుకంటే సినిమాలో కథ,కథనం దగ్గరనుంచి ప్రతి అంశం ఆయన దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ,దర్శకుడుతో నిరంతంరం చర్చిస్తూ సినిమా హిట్ చేస్తూంటారు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ కుమారుడు శ్రీనివాస్ రెండో చిత్రంకు దిల్ రాజు చేతిలో పెట్టారని సమాచారం. బోయపాటి శ్రీను దర్శకుడుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. గతంలో దిల్ రాజు నిర్మాతగా బోయపాటి దర్శకుడుగా రవితేజతో భద్ర చిత్రం నిర్మించి విజయం సాధించారు.

ఇప్పుడు కూడా అలాంటి కథతోనే యాక్షన్ ఎంటర్టైనర్ గా చిత్రం తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రేమ కథను ఎక్కువ హైలెట్ చేయాలని నిర్ణయించుకున్ట్లు సమాచారం. ఇక దర్శకుడుగా బోయపాటి శ్రీను ని ఎంపిక చేసారనగానే విపరీతమైన హింస ఉంటుందని మీడియాలో అంతటా వినపడింది. అయితే ఫ్యామిలీ చిత్రాలు తెరకెక్కించే దిల్ రాజు బ్యానర్ కాబట్టి...ఆయన తప్పకుండా ఇన్వాల్వ్ అయ్యి...చక్కటి సినిమాను అందించే అవకాసం ఉందంటున్నారు. బెల్లంకొండ సురేష్ ఇలా తన కొడుకుకి మంచి కాంబినేషన్ సెట్ చేసి, తను నిర్మించే చిత్రాలపై దృష్టి పెడతాడంటున్నారు.

Dil Raju produces Alludu Srinu's next

సాధారణంగా ఒక సినిమా తర్వాత మరో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి చాలా సమయం తీసుకొంటుంటారు బోయపాటి శ్రీను. 'లెజెండ్‌'తో విజయాన్ని సొంతం చేసుకొన్న ఆయన ఇప్పటిదాకా కొత్త సినిమాని ఖరారు చేయలేదు. కథలతో బోయపాటి సిద్ధంగా ఉన్నా హీరో కుదరకపోవడంతో సినిమా ఆలస్యం అవుతోంది. అయితే తాజాగా ఆయన బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరో గా ఓ సినిమా చేయడానికి సిద్ధమైనట్టు తెలియగానే ఆయన అబిమానులు ఆనందపడ్డారు.

'అల్లుడు శీను'తో వి.వి.వినాయక్‌ చేతులమీదుగా పరిచయమయ్యాడు శ్రీనివాస్‌. తొలి చిత్రంలోనే డ్యాన్సులు, ఫైట్లు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. బోయపాటి రాసుకొన్న ఓ కథ బెల్లంకొండ శ్రీనివాస్‌కి తగ్గట్టుగా ఉందట. అందుకే వారిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనీ, అది త్వరలోనే మొదలవుతుందని కానుంది. బడ్జెట్ పరంగా కూడా భారీగా ఉండనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X