నితిన్ ని హీరోగా నిలబెట్టడానికి నిర్మాత దిల్ రాజు కంకణం
వరస ప్లాపుల హీరోగా పేరు తెచ్చుకున్న నితిన్ కెరీర్ ని చక్కదిద్దటానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా మొదట ఆయన త్వరలో తను నిర్మించబోయే ఓహ్ ..మై ప్రెండ్ చిత్రంలో అతన్ని ఓ హీరోగా తీసుకున్నారు. వేణు శ్రీరామ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఆల్రెడీ సిద్దార్ధ హీరోగా చేస్తున్నారు. అలాగే అతిధి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన అమృతారావుని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇక నితిన్ ..దిల్ రాజుకి బంధువు అవతారు. నితిన్ కెరీర్ రోజు రోజుకీ గాడి తప్పుతూండటం గమనించిన ఆయన నితిన్ ని నిలబెట్టాలని నిర్ణయించుకన్నాడని చెప్తున్నారు. అలాగే తన సర్కిల్ లో నిర్మాతలుకు సైతం ఆయన రికమెండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నితిన్, సిద్దార్ధ ప్రాణ మిత్రులుగా కనిపిస్తారు. నువ్వే కావాలి తరహా రొమాంటిక్ కామిడీ అని, ప్రేమ,స్నేహం చుట్టూ తిరిగే కధాంశంతో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది.అలాగే బొమ్మరిల్లు తర్వాత దిల్ రాజు, సిద్దార్ధ కాంబినేషన్లో మరో చిత్రం రాలేదు. ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ కావటంతో మంచి క్రేజ్ ఏర్పడనుంది.


Click it and Unblock the Notifications











