దిల్ రాజు నాలుగు కొత్త చిత్రాలు- టైటిల్స్

1. కలిసి ఉంటే కలదు సుఖం - దర్శకుడు వేణు శ్రీరామ్ (గతంలో 'ఓ మై ప్రెండ్' డైరక్ట్ చేసాడు)
2. తుళ్ళింత - దర్శకుడు అడవి సాయి కిరణ్ ( గతంలో 'వినాయకుడు' చిత్రం డైరక్ట్ చేసాడు)
3. లవర్ - దర్శకుడు వాసు వర్మ ( గతంలో 'జోష్ ' చిత్రం డైరక్ట్ చేసారు)
ఈ చిత్రాలకి టైటిల్స్ తెలిసాయి కానీ...హీరోలు ఎవరనేది మాత్రం తెలియరాలేదు.
4. అల్లు అర్జున్ - గోపీచంద్ మలినేని దర్శకుడు(బలుపు చిత్రం డైరక్టర్)
ఇక దిల్ రాజు ప్రస్తుతం ఎవడు చిత్రం రిలీజ్ పైనే దృష్టి పెట్టారు. ఎంతో కాలంగా రామ్‌చరణ్ అభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ....మా బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఎవడు. ఈ చిత్రానికి సంభందించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసాము. ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన, శ్రుతి హాసన్, అమి జాక్సన్ అందాలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ,దర్శకుడు వంశీ పైడిపల్లి సూపర్బ్ టేకింగ్, ఈ చిత్రానికి హైలెట్స్ కాగా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు కాజల్ అగర్వాల్ పాత్రలు హైలెట్ గా నిలుస్తాయి. ఈ చిత్రం మెగా అభిమానులకు పండుగ వాతావరణం కల్పించటమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్నారు.
జయసుధ, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, సాయి కుమార్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వంశీ పైడిపల్లి, వక్కతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, కథ సహకారం: హరి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, యాక్షన్ : సెల్వం, ఆర్ట్: ఆనంద్ సాయి, సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications











