దిల్ రాజు కుమారుడికి ఆసక్తికర పేరు.. ఆ ఇద్దరి పేర్లు కలిసేలా.. ఏం పెట్టారో తెలుసా?
నిర్మాత దిల్ రాజు, ఆయన సతీమణి వైఘారెడ్డి దంపతులకు ఇటీవల ఓ మగ బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పుత్రోత్సాహంతో ఉన్నారు. ఎట్టకేలకు వారసుడు పుట్టడంతో దిల్ రాజు ఇంట ఆనందాలు వెల్లివిరిసాయి. మొదటి భార్యతో దిల్ రాజుకు కూతురు పుట్టగా, ఆమెకు పెళ్లయిపోయింది. ఇప్పుడు రెండో భార్య వారసుడికి జన్మనివ్వగా, ఆ బాబుకి నామకరణ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే

2017లో గుండెపోటుతో
దిల్ రాజు మొదటి భార్య అనిత రెండేళ్ల క్రితం మృతి చెందింది. తన మొదటి భార్య అనిత పేరు నుండి మొదటి అక్షరాలు తీసుకొని, దానిని తన రెండో భార్య వైఘా అనే రెండు అక్షరాలతో కలుపుతూ, రాజు తన బిడ్డకు ఈ పేరు పెట్టారని తెలుస్తోంది. సంస్కృతంలో ఈ పేరుకు ఓ అర్థం కూడా ఉంది. ఇక 52 ఏళ్ల దిల్ రాజు, 29 ఏళ్ల వైఘారెడ్డి ఫస్ట్ లాక్‌డౌన్ సమయంలో వివాహం చేసుకున్నారు. దిల్ రాజుకు అనితతో గతంలో వివాహమైంది. అయితే ఆమె 2017లో గుండెపోటుతో మరణించింది.

అన్వై రెడ్డి
ఆయన కుమార్తె హన్షిత అతనిని మళ్లీ పెళ్లి చేసుకోమని కోరడంతో చివరికి తేజస్వి (వైఘా రెడ్డి)ని మే 2020లో వివాహం చేసుకున్నారు. దిల్ రాజు వారసుడికి ఎలాంటి పేరు పెట్టబోతున్నారు అనే విషయం తెలుసుకోవడానికి సినిమా ఇండస్ట్రీ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. అయితే దిల్ రాజు తన కొడుక్కి నామకరణం చేసే లోపు వారు పెట్టబోయే పేరు సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఆ వార్తల ప్రకారం దిల్ రాజు దంపతులు తమ కుమారుడికి అన్వై రెడ్డి అని పేరు పెడుతున్నారు. ఇక విషయం తెలిసిన సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా దిల్ రాజు దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఆర్‌సి 15
ఇదిలా ఉంటే ఆయన సినిమాల నిర్మాణం విషయానికొస్తే... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో పలు ఆసక్తికర చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా ఎస్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఆర్‌సి 15' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.

వంశీ పైడిపల్లితో
చిత్ర బృందం ఇటీవలే అమృత్‌సర్‌లో కొంత భాగాన్ని చిత్రీకరించింది. ఇక ఈ సంవత్సరం ప్రారంభంలో తలపతి విజయ్, రష్మిక మందన్న కలిసి నటించనున్న మొదటి చిత్రాన్ని దిల్ రాజు ప్రకటించారు. విజయ్ ఈ మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తుండగా, ఈ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

థాంక్యూ
ఈ చిత్రంలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు రాజు నాగ చైతన్య కొత్త చిత్రం 'థాంక్యూ'ను కూడా విడుదల చేయడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రాశి ఖన్నా హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











