మహేష్ బాబు రిక్వెస్ట్ ను దిల్ రాజు కాదన్నాడా?
మహేష్ బాబు...తన తాజా చిత్రం ఖలేజా కోసం దిల్ రాజుకి ఫోన్ చేసాడని అయితే అది వర్కవుట్ కాలేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. తమ చిత్రం అక్టోబర్ 7న రిలీజ్ చేసే ఆలోచనలో ఉండగా...దిల్ రాజు..సెప్టెంబర్ 8 బృందావనం రిలీజ్ డేట్ ప్రకటించారని..దీని వలన కలెక్షన్స్ కు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని దిల్ రాజు కు మహేష్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దిల్ రాజు తాము ఇప్పటికే మీడిమాకు తమ చిత్రం రిలీజ్ గురించి చెప్పేసామని కాబట్టి మార్చటం కష్టమని, ఖలేజా గురించి ఎక్కడా అఫీషయల్ అక్టోబర్ 7న రిలీజ్ చేస్తామని మీడియాకు చెప్పలేదనే విషయం గుర్తు చేసాడని తెలుస్తోంది. ధాంతో ఈ సమాదానం ఊహించని మహేష్ బాబు..నిర్మాతను పిలిచి మీకు తోచినట్లు రిలీజ్ చేసుకోమని పురమాయించినట్లు చెప్తున్నారు. మరో ప్రక్క రోబో..అక్టోబర్ 1వ తేదీన 500 ప్రింట్లతో రిలీజవుతోంది. ఆ ఎఫెక్టు కూడా ఖలేజా, బృందావనంపై పడే అవకాశం ఉందని అంటున్నారు. ఏం జరగనుందో చూడాలంటే మరో రెండు వారాలు ఆగాలి. అలాగే వీరిలో ఎవరూ కూడా దశరా పండుగ శెలవల సీజన్ ని వదలుకునేలా లేరు.


Click it and Unblock the Notifications











