twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ కోసం దిల్ రాజు అన్వేషణ.. ఇదీ మ్యాటర్

    |

    యంగ్ రెబల్ స్టార్ కోసం దిల్ రాజు అన్వేషణ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ తన తదుపరి సినిమాను దిల్ రాజు నిర్మాణంలో చేసేందుకు అగ్రీ కావడంతో మంచి దర్శకుడి కోసం దిల్ రాజు అన్వేషిస్తున్నారట. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చలు సాగుతున్నాయి.

    బాహుబలి లాంటి భారీ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ కొట్టేశాడు ప్రభాస్. తెలుగు హీరో టాలెంట్ ఏంటి అనేది ప్రపంచానికి తెలిసేలా చేశాడు. అయితే ఈ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ కంటిన్యూ చేసేలా ప్రస్తుతం 'సాహూ' అనే భారీ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇది పూర్తికాగానే వెంటనే రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. అయితే రాధాకృష్ణ సినిమా చేస్తూనే దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట ప్రభాస్. ఇటీవలే దిల్ రాజు ఓ కథను ప్రభాస్‌కి నేరేట్ చేయగా ఆయన వెంటనే ఓకే అన్నారట. ఈ మేరకు ఈ కథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడి కోసమే దిల్ రాజు అన్వేషణ ముమ్మరంగా సాగుతోందని ఫిలింనగర్ టాక్. గతంలో ప్రభాస్, దిల్ రాజు కాంబోలో మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు వచ్చాయి.

     Dil Raju Searching For Prabhas..?

    ఈ సినిమా సంగతేమో గానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి ప్రభాస్ 'సాహూ' పైనే ఉంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో రాబోతున్న ఈ సినిమా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రంలో మునుపెన్నడూ చూడని అబ్బురపరిచే సన్నివేశాలు చూడొచ్చని అంటున్నారు యూనిట్ సభ్యులు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 15 వ తేదీన 'సాహూ' విడుదల కానుంది.

    English summary
    Young rebal star Prabhas new movie Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully going on. After this will going to act in Dil Raju production
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X