»   » జూ ఎన్టీఆర్ ని అడ్డు పెట్టుకొని దిల్ రాజు సైడ్ బిజినెస్..

జూ ఎన్టీఆర్ ని అడ్డు పెట్టుకొని దిల్ రాజు సైడ్ బిజినెస్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బృందావనం సినిమా చేస్తున్న బిజినెస్ కంటే ఆ చిత్రం పెద్ద హిట్ అని చెప్పుకుంటూ దిల్ రాజు చేస్తున్న వాయిస్ ఎక్కువైందని సినీ వర్గాలు జోక్ చేసుకుంటున్నాయి. బృందావనం సినిమా బాక్సాఫీస్ వద్ద మామూలుగానే ఆడినా దానిని భూతద్దంలోనే చూపించే ప్రయత్నాలను దిల్ రాజు మానట్లేదు. ఈ చిత్రానికి మూడోవారం నుంచి వసూళ్లు బాగా తగ్గిపోయాయి. దాంతో ఈ చిత్రంపై డబ్బులు సంపాదించడానికి దిల్ రాజు వేరే మార్గాలు చూసుకున్నాడు. ఏదో ఒక ఫంక్షన్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసే హక్కులను ఎవరో ఒకరికి అమ్మేస్తున్నాడు. అలా ఎక్స్ట్రా ఇన్ కమ్ తో సంతప్తి పొందుతున్నాడు.

తను ఒక స్టార్ తో సినిమా చేయడానికి చాలా కాలం ఎదురు చూసానని చెప్పుకున్న దిల్ రాజు తన చేతిలో ఒక స్టార్ ఉంటే ఎన్ని రకాలుగా సొమ్ము చేసుకుంటాడనేది చేసి చూపిస్తున్నాడు. బృందావనం చిత్రానికి యాభై రోజుల వేడుకని నిజామాబాద్ లో ప్లాన్ చేస్తున్న దిల్ రాజు ఆ ఫంక్షన్ హక్కులను కూడా అమ్ముకోవడానికి చూస్తున్నాడు. రూపాయి ఖర్చు పెట్టి అయిదు రూపాయలు దండుకోవడానికి ఇది అతనికి సులువైన మార్గంగా కనిపిస్తున్నట్టుంది. బందావనం సినిమాపై ఎంత వస్తే అంత పిండుకోవడానికి దిల్ రాజు అస్సలు మొహమాటపడట్లేదు. ఎన్టీఆర్ కూడా అతనికి ఫుల్ కోపరేషన్ ఇచ్చేస్తున్నట్టు సమాచారం.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu