దిల్ రాజుకు డెడ్ లైన్ ఇచ్చిన మహేష్ బాబు!?
దిల్ రాజు నిర్మాతగా మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు లోగా తనతో సీన్స్ పూర్తి చేసుకోకపోతే సంవత్సరం ఆఖరుకే డేట్స్ ఉంటాయని మహేష్ ఖచ్చితంగా చెప్పినట్లు సమాచారం. సుకుమార్ సినిమాకు సెప్టెంబర్ నుంచి కంటిన్యూగా డేట్స్ కేటాయించానని చెప్పాడని చెప్తున్నారు. దాంతో దిల్ రాజుకి టెన్షన్ పట్టుకుందని చెప్తున్నారు.
మొదట్లోనే ప్రకాష్ రాజ్ తో వివాదంతో అనుకున్న షెడ్యూల్ టైమ్ కి ప్రారంభం కాలేదు. దానికి తోడు ఇప్పుడు సమంతకు జ్వరం రావటంతో ఆమె కాంబినేషన్ లో మహేష్ చేయాల్సిన సీన్స్ పూర్తి కావటం లేదు. మరో ప్రక్క దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ ప్రతీది ఫెరపెక్షన్ తో తీయాలనే తపనతో చాలా స్లోగా తీస్తున్నాడని చెప్తున్నారు. ఈ నేపధ్యంలో దిల్ రాజు ఎవరికీ ఏమి చెప్పలేని స్దితిలో పడ్డాడని, సాధ్యమైనంత తొందరగా ఫినిష్ చేసి సెప్టెంబర్ 29న చిత్రం విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడని చెప్తున్నారు.
వెంకటేష్, మహేష్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటిలో జరుగుతోంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో దిల్ రాజు చిత్రం గురించి మాట్లాడారు. ఆయన చిత్రం కాన్సెప్టు గురించి చెపుతూ...ఉమ్మడి కుటుంబంలో అనుబంధాలూ ఆప్యాయతలూ చూసి ఎంతకాలమైంది? ఉద్యోగం పేరుతో ఒకరు రెక్కలు కట్టుకొని విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇంకొకరిది పట్నవాసం. ఇంటిల్లిపాదీ మళ్లీ కలుసుకోవాలంటే పండగో, పెళ్లిపిలుపో రావాల్సిందే. అప్పుడు కూడా సెలవులు దొరికితేనే! అందుకే బాబాయ్, పిన్ని, వదిన, మేనత్త... ఇలాంటి పిలుపులకు దూరమైపోతున్నాం.
ఆరు బయట వెన్నెల్లో కబుర్లు చెప్పుకొనే రోజులు మర్చిపోతున్నాం. మళ్లీ అలాంటి వాతావరణం మా సినిమాలో చూడొచ్చు అన్నారు. అలాగే చిత్రంలో వెంకటేష్, మహేష్‌బాబులు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. వారిద్దరిపై వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకొంటాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారని అన్నారు.సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో మహేష్‌బాబు, సమంత తదితరులపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: గుహన్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











