వివాదాస్పదం.. రాజ్‌తరుణ్ అరెస్ట్.. టెన్షన్ పడుతున్న దిల్ రాజు!

రెండు రోజుల క్రితం రాజ్‌తరుణ్ కారు ప్రమాదానికి గురికావడం, అది కాస్త చర్చనీయాంశంగా మారడంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు టెన్షన్ లో పడిపోయారని తెలుస్తోంది. అరె! ఇదెక్కడి కొత్త ట్విస్ట్.. రాజ్‌తరుణ్ కారు ప్రమాదానికి దిల్ రాజుకు లింకేంటి? అని ఆశ్చర్యపోతున్నారు కదూ. పూర్తి వివరాలు చూడండి మీకే తెలుస్తుంది.

సెల్ ఫోన్‌లో రికార్డ్.. వెంటపడి పట్టుకున్నాడు

సెల్ ఫోన్‌లో రికార్డ్.. వెంటపడి పట్టుకున్నాడు

రాజ్‌తరుణ్ కారు ప్రమాదానికి గురైన సమయంలో కార్తీక్ అనే ఓ వ్యక్తి ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. అంతేకాదు రాజ్‌తరుణ్ కారు దిగి పారిపోతుండగా అతన్ని వెంటాడి పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చలు కూడా సాగాయి.

 కారు దిగి పారిపోవడంపై వివరణ

కారు దిగి పారిపోవడంపై వివరణ

యాక్సిడెంట్ తర్వాత పారిపోవడంపై ప్రత్యేకంగా వివరణ ఇచ్చాడు రాజ్‌తరుణ్. ‘నేను క్షేమంగానే ఉన్నాను. నాకోసం ప్రార్ధించిన వారందరికీ ధన్యవాదాలు. ప్రమాదం జరిగిన తర్వాత కారు నుంచి కిందికి దిగాను. కారును చూశాను. నాకేమైనా గాయాలయ్యాయేమోనని చూసుకున్నాను. ఆ వెంటనే ఎవరి సహాయమైనా తీసుకుందామన్న ఉద్దేశ్యంతో అక్కడి నుంచి వేగంగా పారిపోయాను. ఆ యాక్సిడెంట్ సమయంలో జరిగింది అంతా ఇదే' అని అతడు చెప్పుకొచ్చాడు.

ఊహించని మలుపులు.. చివరకు అరెస్ట్

ఊహించని మలుపులు.. చివరకు అరెస్ట్

రాజ్‌తరుణ్ ప్రమాదం ఉదంతంలో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. రాజ్‌ తరుణ్‌ మేనేజర్‌ నటుడు రాజా రవీంద్రతో పాటు మరో మహిళ ఎంట్రీ ఇవ్వడం, బెదిరింపులు లాంటి ఎన్నో ఉదంతాలు జరిగాయి. అయితే చివరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హీరో రాజ్ తరుణ్‌ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

టెన్షన్‌లో దిల్ రాజు

టెన్షన్‌లో దిల్ రాజు

ఇలాంటి సమయంలో దిల్ రాజు టెన్షన్ పడుతున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మిస్తున్నాడు. జిఆర్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. 'ఇద్దరి లోకం ఒకటే' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రాజ్ తరుణ్ అరెస్ట్ నేపథ్యంలో ఆగే ఛాన్స్ ఉంది.

సినిమాపై నెగెటివ్ ఇంప్రెషన్

సినిమాపై నెగెటివ్ ఇంప్రెషన్

రాజ్ తరుణ్ యాక్సిడెంట్ చేయడం.. పైగా మద్యం సేవించి కారు నడిపాడనే ఆరోపణలు రావడం, ఆ తర్వాత వివాదాల్లో ఇరుక్కోవడంతో తన సినిమాపై ఎలాంటి ప్రభావం చూపించబోతుందో అని దిల్ రాజు ఆలోచనలో పడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X