దిల్ రాజుకి ట్విస్ట్ ఇచ్చిన అనుష్క
తాను నిర్మిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టుకోసం దిల్ రాజు ..అనుష్కని అడగటం..ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది మహేష్ కు వదినగా చేస్తే కెరీర్ కు ఇబ్బంది అవుతుందని చెప్తూండటంతో ఆమె ఇప్పుడు డైలమాలో పడిందని సమాచారం. వెంకటేష్ కి భార్యగా ఈ చిత్రంలో ఆమె చేయాలి. అంటే మహేష్ కు వదిన అవుతుంది. ఇప్పటికే ఈ పాత్రను త్రిష,భూమిక మరికొందరు కాదన్నారు. అయితే మొదట తాను అలాంటివేమి పట్టించుకోనని ఈ ప్రాజెక్టును ఓకే చేసింది. అయితే ఇప్పుడు ఆమె ఆలోచనలో పడి దిల్ రాజు ప్రాజెక్టుకు నో చెప్తోంది. అయితే ఇప్పటికీ దిల్ రాజు ఆమెను కన్వీన్స్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడని వినికిడి. మొదటే కాదంటే వేరే వాళ్లను వెతుక్కునేవాళ్లమని,ఇప్పుడు షూటింగ్ దగ్గరపడుతూండగా ఇలా అంటే కష్టమని ఆయన అనుష్కకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడని చెప్తున్నారు. ఈ నెల 15 నుంచి వైజాగ్ లో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.
కొత్త బంగారులోకంతో పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. అయితే అనుష్క తను వదిన చేయటానికి ఇబ్బంది లేదు కానీ తమిళంలో తను హీరోయిన్ గా చేసే సినిమాలకు డేట్స్ క్లాష్ వస్తుంది కాబట్టి నో అంటోందిట. అలాగే ఈ ప్రాజెక్టు నిమిత్తం ఆమె అడ్వాన్స్ కూడా తీసుకోలేదట. దాంతో ఆమెను ఆపటం ఎలాగా అని దిల్ రాజు తలపట్టుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రంపై వెంకటేష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయన చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. ఇందులో వెంకటేష్,మహేష్ ఇద్దరూ అన్నదమ్ములుగా కనిపిస్తారు. మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. ప్రకాష్ రాజ్ వీరి తండ్రిగా కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











