ప్రభాస్‌ మార్కెట్ వాల్యూ పెరిగింది, కోట్ల రూపాయలు...దిల్ రాజు ట్రై చేస్తున్నాడా?

ప్రభాస్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా గతంలో రెండు సినిమాలు వచ్చాయి. అందులో మొదట వచ్చిన 'మున్నా' బాక్సాఫీసు వద్ద పరాజయం పాలవ్వగా.... తర్వాత వచ్చిన 'మిస్టర్ పర్ఫెక్ట్' మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభాస్‌తో కాంబినేషన్ సెట్ చేసుకునేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నారట.

బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ స్థాయి హీరో అయ్యాడు. మార్కెట్ వ్యాల్యూ కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అతడితో సినిమా చేస్తే ఇటు తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా విడుదల చేసి మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఈ నేపథ్యంలో దిల్ రాజు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారట.

2020 వరకు బిజీ బిజీ

2020 వరకు బిజీ బిజీ

ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో ‘సాహో' సినిమాతో పాటు... రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడు. 2020 వరకు అతడి కాల్షీట్లన్నీ బిజీగా ఉన్నాయి. ఆ తర్వాత ఎలాగైనా ప్రభాస్ కాల్షీట్స్ దక్కించుకోవాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కెజిఎఫ్ దర్శకుడితో?

కెజిఎఫ్ దర్శకుడితో?

‘కెజిఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కోసం మంచి కథను సిద్ధం చేశాడని, ప్రభాస్ ఇమేజ్‌కు తగిన విధంగా మాస్ ఎలిమెంట్స్‌ ఉన్న స్క్రిప్టు కావడంతో యూవి క్రియేషన్స్ వారు ఈ ప్రాజెక్టు సాధ్య సాధ్యాలపై ఆరా తీస్తుండగా దిల్ రాజు సైతం ఈ వ్యవహారంలోకి ఎంటరైనట్లు సమాచారం.

సంక్రాంతిపై దిల్ రాజు భారీ హోప్స్

సంక్రాంతిపై దిల్ రాజు భారీ హోప్స్

కాగా.. దిల్ రాజు నిర్మించిన ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సంక్రాంతికి విడుదలకు సిద్దం అవుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్‌గా రూపొందిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై దిల్ రాజు భారీ హోప్స్ పెట్టుకున్నారు.

ప్రభాస్

ప్రభాస్

ఇక ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘సాహో' చిత్రం ఇప్పటికే మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుని త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X