twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజు వార్నింగ్ ఇవ్వబట్టే సిద్దార్ధ

    By Srikanya
    |

    ప్రముఖ నిర్మాత దిల్ రాజు చిత్రంలో సిద్దార్ద నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓహ్ మై ప్రెండ్ టైటిల్ తో నిర్మాణమవుతున్న ఈ చిత్రం సమయంలో దిల్ రాజు సీరియస్ గా సిద్దార్దకు వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. వార్నింగ్ ఇవ్వవలిసిన అవసరం ఏమి వచ్చిందీ అంటే సిద్దార్ద సినిమాలను ఎలక్ట్రానిక్ మీడియా బ్యాన్ చేయటమేని తెలిసింది. ఎలక్ట్రానిక్ మీడియాకు సారి చెప్పమని దిల్ రాజు ఒత్తిడి తెచ్చినా సిద్దార్ధ పలకకపోవటంతో సినిమా రిలీజయ్యేదాకా అయినా సైలెంట్ గా ఉండమని ఎవరి గురించి ట్విట్టర్ లో కామెంట్ లు చేయవద్దని వార్నింగ్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు.

    కొద్ది రోజుల క్రిందట సిద్దార్ధ పై ఎలక్ట్రానిక్ మీడియా బ్యాన్ పెట్టి, మా కి కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో సిద్దార్ధకు మా అశోశియేషన్ వాళ్ళు నోటీసులు కూడ జారీ చేసారు. అయితే సిద్దార్ద చాలా కూల్ గా ఉన్నాడు. మీడియా వారు మాత్రం సిద్దార్ద ఎట్టి పరిస్దితుల్లోనూ క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుపడుతున్నారు. అయితే సిద్దార్ద మాత్రం దానికి అంగీకరించటం లేదు. ఇక సినిమా పూర్తయితే దాని ప్రమోషన్ కి తమ అవసరం వస్తుంది కదా అని మీడియా వారు అంటున్నారు.ఈ నేపధ్యంలో దిల్ రాజు ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తాడనేది ఆసక్తికరం.

    English summary
    Siddharth received notices served by MAA for the derogatory comments made by him against journalists. Though he is not looking worried, producer Dil Raju is mediating with media journalists in settling the problem amicably.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X