చిరంజీవి మూవీలో విలన్‌గా హాట్ బ్యూటీ.. బాబీ స్కెచ్ మామూలుగా లేదు!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కు 'వాల్తేరు వీరయ్య'(Waltair Veerayya)తో భారీ బ్లాక్‌బస్టర్ అందించిన మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి ( Bobby Kolli). ఈ మాస్ డైరెక్టర్ తో మెగాస్టార్ మరోసారి జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ సూపర్ హిట్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను ఏప్రిల్ 11న ఘనంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమాకు 'కాకాజీ' అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, ఈ క్రేజీ మూవీకి సంబంధించిన ఓ షాకింగ్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ మూవీలో లేడీ విలన్ గా ఓ హాట్ బ్యూటీ నటించబోతుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ? బాబీ ప్లానింగ్ ఏంటీ?

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. టాలీవుడ్‌లో ఎన్నో మంది హీరోయిన్లు ఉన్నా, కొందరే ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తారు. అలాంటి వారిలో డింపుల్ హయాతి ఒకరు. విజయవాడలో జన్మించిన ఈ గ్లామరస్ బ్యూటీ, తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 2017లో వచ్చిన గల్ఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డింపుల్, ఆ తర్వాత గద్దలకొండ గణేష్‌లో స్పెషల్ సాంగ్‌తో మంచి క్రేజ్ వచ్చింది. అనంతరం రవితేజ సరసన ఖిలాడీలో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తర్వాత రామబాణం, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరిస్తుంది ఈ భామ.

Dimple Hayathi as Lady Villain in Chiranjeevi Bobby Film

అయితే.. తాజా సమాచారం ప్రకారం.. చిరంజీవి మూవీలో హీరోయిన్ డింపల్ హయాతి (Dimple Hayathi)ఒక కీలక పాత్రలో కనిపించనుందట. అయితే అది సాధారణ హీరోయిన్ పాత్ర కాదని, నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రలు, స్పెషల్ సాంగ్స్, కమర్షియల్ పాత్రల్లో కనిపించిన డింపుల్ ఈసారి విలన్ తరహా పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించే అవకాశం ఉంది. దర్శకుడు బాబీ తన సినిమాల్లో ప్రతినాయక పాత్రలను స్ట్రాంగ్ గా డిజైన్ చేయడంలో పేరుగాంచారు. అందుకే ఈ పాత్రపై మరింత ఆసక్తి పెరిగింది.

ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుందని సమాచారం. అలాంటి కథలో చిరంజీవికి ఎదురు నిలిచే మహిళా పాత్రకు మంచి స్కోప్ ఉండొచ్చు. ఒకవేళ డింపుల్ నిజంగానే ఆ పాత్రలో నటిస్తే, ఆమె నటనకు పెద్ద పరీక్షగా కూడా మారుతుంది. గ్లామర్ స్టార్ అనే ట్యాగ్‌ను దాటి నటిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశంగా సినీ విశ్లేషకులు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రియమణి (Priyamani) ప్రధాన హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అటు అనుభవజ్ఞురాలైన ప్రియమణి, ఇటు కొత్త కోణంలో కనిపించబోతున్న డింపుల్ ఈ ఇద్దరి పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవొచ్చని అంచనా వేస్తున్నారు.

మరోవైపు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NBK111 సినిమాలో కూడా డింపుల్ నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మొదట్లో ఈ వార్తలను కొందరు కొట్టిపారేసినా, ఇటీవల బాలకృష్ణ మరియు డింపుల్ ఒకే హెలికాప్టర్‌లో కనిపించిన వీడియోలు వైరల్ కావడంతో ఆ చర్చ మళ్లీ ఊపందుకుంది. ఇక డింపుల్ కెరీర్‌ను పరిశీలిస్తే, ఆమె వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నా, పెద్ద స్టార్‌డమ్‌ను అందించే సినిమా మాత్రం ఇంకా రాలేదు. ఇప్పుడు చిరంజీవి, బాలయ్య వంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్‌గా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X