Guntur karam మూవీలో బెజవాడ పిల్ల.. మహేశ్‌తో కలిసి స్పెషల్‌ సర్‌ప్రైజ్

తెలుగు చిత్ర పరిశ్రమలో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూ.. సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా.. తన రేంజ్‌ను మాత్రం పెంచుకుంటూ వెళ్తున్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం భారీ హిట్‌ను అందుకోవాలనుకుంటోన్న మహేశ్ 'గుంటూరు కారం' అనే మూవీలో నటిస్తున్నాడు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తోన్న చిత్రమే 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. అంతలా ఇది ఆరంభం నుంచే హైప్‌ను పెంచుకుంటూ ముందుకెళ్తోంది. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను క్రేజీగా రూపొందిస్తున్నారు.

Dimple Hayathi Special Song In Mahesh Babu Guntur karam Movie

సుదీర్ఘ కాలం తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురు కావడంతో షూటింగ్ సజావుగా సాగట్లేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఈ మూవీ షూట్ శరవేగంగా జరుగుతూ దీన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

పక్కా కమర్షియల్ హంగులతో రాబోతున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి ఎన్నో రకాల అంశాలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ గురించి న్యూస్ కొద్ది రోజుల క్రితమే రివీల్ అయింది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో మాంచి మాస్ నెంబర్ ఉన్న ఐటెం సాంగ్‌ను పెట్టారని, దీనికి థమన్ ఇప్పటికే ట్యూన్ రెడీ చేశారని తెలుస్తోంది.

Dimple Hayathi Special Song In Mahesh Babu Guntur karam Movie

'గుంటూరు కారం' మూవీలోని స్పెషల్ సాంగ్‌ కోసం ఓ స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. విజయవాడ అమ్మాయి డింపుల్ హయాతిని చిత్ర యూనిట్ తీసుకుందని తెలిసింది. ఆమె గతంలో 'గద్దలకొండ గణేష్'లో తన అందంతో ఊపిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X