లక్ష ఖర్చు పెడితే పవన్ కళ్యాణ్‌తో డిన్నర్!?

By Bojja Kumar

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చే అభిమానులు ఎంత మంది ఉన్నారో లెక్క చెప్పడం కాస్త కష్టమే. టాలీవుడ్లో ప్రస్తుతం ఆయన నెం.1 హీరో. ఆయన్ను చూస్తే చాలు, కలిస్తే చాలు అని ఉబలాట పడే ఫ్యాన్స్ ఎందరో. అలాంటి ఆయనతో కలిసి ఏకంగా భోజనం చేస్తూ మాట్లాడే అవకాశం వస్తే అభిమానులకు పండగే.

ఈ నెల 29న హైదరాబాద్‌లోని జేఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో ‘డిన్నర్ విత్ స్టార్స్' పేరుతో టాలీవుడ్ పరిశ్రమకు చెందిన వారు ఓ కార్యక్రమం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా వచ్చిన డబ్బును హుధూద్ తుఫాను కోసం అందజేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారట. ఈ కార్యక్రమానికి పలువురు స్టార్స్‌ను ఆహ్వానించనున్నారట.

Dinner With Pawan Kalyan

ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ పిలిచే ఉద్దేశ్యంలో ఉన్నారట. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో స్టార్స్‌తో కలిసి డిన్నర్ చేయడం, వారితో ఫోటోలు దిగడం, వారితో మాట్లాడటం లాంటివి కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ‘డిన్నర్ విత్ స్టార్స్' కార్యక్రమం టికెట్ ధర దాదాపు లక్ష వరకు ఉండొచ్చని అంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ వస్తే అభిమానులు అంత మొత్తం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండటమే ఇందుకు కారణం.

ఒక మంచి కార్యక్రమం కోసం జరుగుతున్న ఫ్రొగ్రాం కావడంతో సినీ అభిమానుల నుండి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. అయితే 30వ తేదీ ‘మేము సైతం' కార్యక్రమం ఉండటంతో ‘డిన్నర్ విత్ స్టార్స్' అసలు ఉంటుందా? ఉండదా? అనేదిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X