Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ప్రియమణి
ఒక నటిగా ప్రియమణి కత్తికి రెండు వైపులా పదునే. తన నటనతో జాతీయ పురస్కారాన్ని కొంగున కట్టేసుకోగలదు.. కొంగు చాటు అందాలన్ని టోకున ఆరబెట్టేసి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేయనూ గలదు. ఇప్పుడు తనలో మరో కోణం కూడా ఉందని నిరూపించేందుకు తహతహలాడుతోంది. అతి త్వరలోనే మెగాఫోన్ పట్టుకునేందుకు తాను ఏర్పాట్లు చేసుకుంటున్నానని ప్రియమణి ప్రకటిస్తోంది. షూటింగ్ లో యూనిట్ మెంబర్స్ కు సూచనలిచ్చేందుకుగాను డైరెక్టర్స్ పట్టుకునే మినీమైక్ ను మెగాఫోన్ అంటారు. మెగాఫోన్ పట్టుకోవడమంటే డైరెక్షన్ చేయడమని అర్దం. దర్శత్వం చేయాలన్నది తన కలని, ఆ కలను నెరవేర్చుకునేందుకు తాను ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుకుంటున్నానని ప్రియమణి చెప్పుకొస్తున్నది. తన స్నేహితులు కూడా తన దర్శకత్వంలో సినిమా తీయాలని అడుగుతున్నారట..
ఐతే ఇప్పుడు కాదంట.. ఇంకా రెండు సంవత్సరాల తర్వాత సినిమా తీస్తుందట. ప్రస్తుతానికి నటన మీదే దృష్టి పెట్టానని రెండు సంవత్సరాల తర్వాతే దర్శకత్వంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతానంటుంది. తను నటించిన సినిమాలలో దర్శకుల నుంచి చాలా నేర్చుకున్నానని, ఆ అనుభవాలు నాకు ఉపయోగపడతాయని చెపుతుంది. ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్లు దర్శకులుగా మారి సినిమా తీసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఇటీవలకాలంలో హీరోయిన్లు డైరెక్షన్ చేయడమన్నది జరగడం లేదు. కాబట్టి ఆవిధంగానూ ప్రియమణి తన ప్రత్యేకతను ప్రకటించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నట్లుంది!