ధురంధర్ డైరెక్టర్ నెక్ట్స్ సినిమా ఫిక్స్! ఆదిత్యధర్ ప్లాన్ మామూలుగా లేదుగా?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఈ మూవీ ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ధురంధర్ 1' ఒకే భాషలో విడుదలైన రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇలాంటి ఘన విజయం సాధించిన మూవీకి సిక్వెల్ గా వచ్చిన మూవీ ధురంధర్ 2. ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగా ఉగాది కానుకగా మార్చి 19న ధురంధర్ 2 మూవీ గ్రాండ్ గా విడుదలైంది.

తాజాగా విడుదలైన 'ధురంధర్ 2' పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేసింది. భారీ ఓపెనింగ్స్ నమోదు అందుకుంది. ఇలా ధురంధర్ 2 ఫస్ట్ డేనే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ప్రీమియర్స్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.172.63 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.ఇలాంటి భారీ విజయం సాధించిన ఆదిత్య ధర్‌ను టాప్ డైరెక్టర్ల జాబితాలో నిలబెట్టాయి. .దీంతో ఆయన తదుపరి సినిమా ఎవరితో? ఏ జానర్‌లో? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి.

Director Aditya Dhar s Next After Dhurandhar 2 Pan-India Multistarrer Buzz

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆదిత్య ధర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ముగ్గురు స్టార్ హీరోలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు బాలీవుడ్ స్టార్, ఒకరు టాలీవుడ్ స్టార్, మరొకరు కోలీవుడ్ స్టార్ అని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా రేంజ్‌లో భారీ మల్టీస్టారర్‌గా రూపొందించాలనే ప్లాన్‌లో ఉన్నాడట. ఒకే సినిమాలో మూడు ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలను తీసుకురావడం అంటే అది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక భారీ ఈవెంట్‌గా మారే అవకాశం ఉంది.

కథ విషయానికి వస్తే.. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాకుండా మైథాలజీ , మోడ్రన్ వార్‌ఫేర్ కలయికలో ఉండబోతుందని సమాచారం. మహాభారతంలోని అశ్వత్థామ పాత్రను ఆధునిక కాలానికి అన్వయిస్తూ, సైన్స్ ఫిక్షన్ టచ్‌తో ఈ కథను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు 'ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ' అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ కాన్సెప్ట్ కన్‌ఫర్మ్ అయితే, ఇది భారతీయ సినిమాకు మరో కొత్త దిశను చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అసలు ఈ 'అశ్వత్థామ' ప్రాజెక్ట్ కొత్తది కాదు. గతంలో విక్కీ కౌశల్ హీరోగా ఆదిత్య ధర్ ఈ సినిమాను ప్రారంభించాలని ప్రయత్నించాడు. కానీ భారీ VFX అవసరాలు, బడ్జెట్ సమస్యలు, అలాగే కరోనా పరిస్థితుల కారణంగా ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు 'ధురంధర్' సిరీస్ విజయంతో ఆదిత్య ధర్ మార్కెట్ విలువ పెరగడంతో, ఈ ప్రాజెక్ట్‌ను మళ్లీ పట్టాలెక్కించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పలు బడా నిర్మాణ సంస్థలు కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

ఇక మరోవైపు టాలీవుడ్ స్టార్లతో కూడా ఆదిత్య ధర్ చర్చలు జరిపాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 'ధురంధర్ 2'పై అల్లు అర్జున్ చేసిన ప్రశంసలు కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే, ఇది టాలీవుడ్‌లోనే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అతిపెద్ద మల్టీస్టారర్‌గా నిలిచే అవకాశం ఉంది.

ఆదిత్య ధర్ తన కెరీర్‌లోనే ప్రతి ప్రాజెక్ట్‌తో ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయాలని చూస్తున్నాడని స్పష్టమవుతోంది. 'ఉరి'తో దేశభక్తి నేపథ్యాన్ని కొత్తగా చూపించిన ఆయన, 'ధురంధర్' సిరీస్‌తో స్పై యాక్షన్ జానర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. ఇప్పుడు మైథాలజీ + మోడ్రన్ కాన్సెప్ట్‌తో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అయితే.. అది ఇండియన్ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలవడం ఖాయమని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X