F3 తరువాత మరో కామేడి మల్టీస్టారర్ కోసం డైరెక్టర్ ప్లాన్.. రాబోయేది ఎప్పుడంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మల్టీస్టారర్ సినిమాలు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునేది F3 సినిమా. కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ దర్శకుడు అనిల్ రావిపూడి F 2 సినిమాకు ఫ్రాంచైజ్ గా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల చివరిలోనే సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఈ ప్రాజెక్టు అనంతరం దర్శకుడు మరో మల్టీస్టారర్ సినిమాను కూడా తెరకెక్కించబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఆ వివరాల్లోకి వెళితే..

పదేళ్లు కష్టపడి..
మొదట టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రచయితగా మంచి గుర్తింపును అందుకున్న అనిల్ రావిపూడి దర్శకుడిగా మారడానికి దాదాపు పదేళ్ల సమయం పట్టింది. ఇక ఈ క్రమంలో అతను ఎన్నో విభిన్నమైన కామెడీ సినిమాలకు వర్క్ చేశాడు. అంతే కాకుండా కమర్షియల్ అంశాలతో మంచి యాక్షన్ సన్నివేశాలను కూడా తనదైన శైలిలో నిరూపించుకున్నాడు.

ఈసారి మరింత ఎక్కువగా..
మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా తో అగ్ర దర్శకుడి గా మారిపోయిన అనిల్ రావిపూడి ఆ ప్రాజెక్టు అనంతరం ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా F3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఈ సినిమాలో కూడా వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి నటించారు. తప్పకుండా ఈ సారి మరింత ఎక్కువ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రం యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

విడుదలకు రెడీ!
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. నటినటులు అందరూ కూడా వారి డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుంటున్నారు. నెలాఖరున సినిమా విడుదల అవుతూ ఉండడంతో రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. మే 27వ తేదీన ఎఫ్ 3 సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఆ తరువాత బాలయ్యతో?
అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. బాలకృష్ణ తో కూడా ఒక సినిమా చేయాలని గత ఏడాది నుంచి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇంకా వీరి కలయికలో వచ్చే సినిమాకు కథ ఇదే ఫైనల్ కాలేదు. బాలకృష్ణ కూడా కథ విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు అని సమాచారం.

F4.. వచ్చేది ఎప్పుడంటే?
ఇక ఎలాగైనా బాలకృష్ణ తో సినిమా చేయాలని అనిల్ రావిపూడి అయితే ఒక బలమైన నిర్ణయం తో ఉన్నాడు. అయితే అనిల్ రావిపూడి మరో మల్టీస్టారర్ సీక్వెల్ పై ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. F 3 సినిమాకు కూడా డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఇంకా ఫ్రాంచైజ్ ను కొనసాగించాలని అనుకుంటున్నాడట. అంటే F 3 సినిమా కూడా రాబోతుందట. ఆ సినిమాను వీలైతే వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చు అని తెలుస్తోంది. అది కూడా ఒక మల్టీస్టారర్ ప్రాజెక్టు గానే ఉంటుందట. మరి ఆ సినిమాలో అనిల్ ఎలాంటి ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











