మహేష్ 26: డైరెక్టర్ అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ లీక్!

Recommended Video

Anil Ravipudi Huge Remuneration For Mahesh Babu Film || Mahesh 26 || Mahesh Babu || Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఇటీవల అతడు చెప్పిన స్క్రిప్టుతో ఇంప్రెస్ అయిన మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కెరీర్లో తొలిసారిగా సూపర్ స్టార్‌తో చేసే అవకాశం రావడంతో దీన్ని సద్వినియోగం చేసుకుని, టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే హిట్ కొట్టాలనే కసితో తను రాసుకున్న స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నాడు అనిల్ రావిపూడి.

మహేష్ బాబు కెరీర్లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి

హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి

‘ఎఫ్ 2' మూవీతో తెలుగు సినిమా చరిత్రలో మరో భారీ విజయాన్ని(రూ. 130 కోట్ల గ్రాస్) నమోదు చేశాడు అనిల్ రావిపూడి. బేసిగ్గా రచయిత అయిన అనిల్ ‘పటాస్' మూవీతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు. ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాలు కూడా మంచి విజయం అందుకోవడంతో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎఫ్ 2 విజయం తర్వాత తన రెమ్యూనరేషన్ పెంచేశాడట.

మహేష్ బాబు మూవీకి అనిల్ రెమ్యూనరేషన్ ఎంత?

మహేష్ బాబు మూవీకి అనిల్ రెమ్యూనరేషన్ ఎంత?

మహేష్ బాబు సినిమాకు అనిల్ ఎంత తీసుకుంటున్నాడు? అనేది హాట్ టాపిక్ అయింది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అతడికి రూ. 12 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే సినిమా విడుదలై విజయం అందుకున్న తర్వాతే అతడికి ఈ మొత్తం అందేలా ఒప్పందం కుదురినట్లు టాక్.

ఈ హిట్టు పడితే టాప్ లిస్టులో అనిల్ రావిపూడి

ఈ హిట్టు పడితే టాప్ లిస్టులో అనిల్ రావిపూడి

వరుస విజయాలతో అనిల్ రావిపూడి డిమాండ్ ఉన్న డైరెక్టర్‌గా మారినప్పటికీ... టాలీవుడ్ అగ్రదర్శకుల లిస్టులో ఇంకా చోటు దక్కించుకోలేదు. మహేష్ బాబుతో తీసే సినిమాతో హిట్టు కొడితే అతడి పేరు టాప్ లిస్టులో చేరుతుందని ఇండస్ట్రీ విశ్లేషకులు అంటున్నారు.

మహేష్ 26

మహేష్ 26

మహేష్ 26 చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుతున్నాయి. త్వరలో సినిమా లాంచ్ చేసి ఈ ఏడాది ఆఖరుకల్లా ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారట. మహేష్ బాబు రెమ్యూనరేషన్ కాకుండా... రూ. 50 కోట్ల ప్రొడక్షన్ కాస్ట్‌తో బడ్జెట్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X