మరోసారి బాలయ్యను టార్గెట్ చేసిన బాక్సాఫీస్ డైరెక్టర్!
యంగ్ టాలెంటెడ్ హీరో అనిల్ రావిపూడి జోరు మామూలుగా లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో సీనియర్ దర్శకులను మైమరపిస్తున్న ఈ దర్శకుడు కథ చెబితే ఇప్పుడు ఏ హీరో అయినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. పటాస్ సినిమా నుంచి సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు అనిల్ వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. దీంతో నిర్మాతలు ఈ దర్శకుడిని బాక్సాఫీస్ డైరెక్టర్ అని ఇష్టాంగా పిలుచుకుంటున్నారు.
ఇకపోతే ఈ దర్శకుడు నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో F2 సినిమాకు సీక్వెల్ చేయనున్నట్లు అనిల్ ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. అయితే అందులో హీరోలు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావడానికి ఇంకా టైమ్ పడుతుందట. ఇకపోతే చాలా రోజుల తరువాత అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్ కి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది.

పటాస్ సినిమా తరువాత అనిల్ బాలకృష్ణతో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉండిపోయింది. ఇక ఇన్నాళ్లకు మళ్ళీ అనిల్ బాలకృష్ణ ప్రాజెక్ట్ పై స్పెషల్ టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. F3 అనంతరం ఎలాగైనా బాలయ్యతో ఒక సినిమా చేయాలని ఆయనకు కథ చెప్పాలని రెడీ అవుతున్నారట. లాక్ డౌన్ అనంతరం ఈ కాంబినేషన్ పై ఎదో ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











