కరోనా గ్యాప్‌లో F3 సెట్.. కానీ అనిల్ రావిపూడికి అదొక్కటే కన్ఫ్యూజనటా!

గత ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచిన టాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ F2 కి కొనసాగింపుగా మరో సినిమా వస్తుందని ఆడియెన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. F2 సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలి ఆడియెన్స్ ని ఏ స్థాయిలో ఆకర్షించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాత దిల్ రాజు వెంటనే F3 పై క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా సీక్వెల్ ఉంటుందని అన్నారు.

 వెంకటేష్ - వరుణ్ తేజ్ మరోసారి..

వెంకటేష్ - వరుణ్ తేజ్ మరోసారి..

వెంకటేష్ - వరుణ్ తేజ్ మొదటిసారి బిగ్ స్క్రీన్ పై కామెడీ టైమింగ్ తో ఆడియెన్స్ కి మరచిపోలేని కిక్కిచ్చరనే చెప్పాలి. F2 సినిమా బాక్సాఫీస్ వద్ద 100కోట్లకు పైగా కలెక్షన్స్ తో టాలీవుడ్ టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఆ సినిమాతోనే వెంకటేష్ ఫామ్ లోకి రావడం విశేషం. ఇక వరుణ్ తేజ్ కెరీర్ కి కూడా ఆ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక ఇంత మంచి సినిమాకు సీక్వెల్ కోసం మరొకసారి కలిసేందుకు ఈ హీరోలు ఏ మాత్రం వెనుకాడడం లేదు.

కరోనా వల్ల కథ సెట్టయినట్లే..

కరోనా వల్ల కథ సెట్టయినట్లే..

కరోనా కారణంగా డైరెక్టర్ అనిల్ రావిపూడికి మంచి టైమ్ దొరికింది. అసలైతే అనిల్ నెక్స్ట్ రామ్ చరణ్ తో సినిమా చేయనున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ న్యూస్ పై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ముందుగానే మెగా పవర్ స్టార్ కోసం అనిల్ కథను సిద్ధం చేసినట్లు టాక్. ఇక కరోనా వల్ల దొరికిన టైమ్ ని పూర్తిగా అనిల్ F3 కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. తన టీమ్ తో కలిసి అల్ మోస్ట్ ఫుల్ స్క్రిప్ట్ ని ఫినిష్ చేశారట.

అనిల్ మైండ్ బ్లోయింగ్ ఫామ్..

అనిల్ మైండ్ బ్లోయింగ్ ఫామ్..

డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ ఏ సినిమా చేసినా ఆ సినిమా బిజినెస్ మాత్రం ముందు సినిమాలకంటే మరీంత పెరిగేలా కనిపిస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో సక్సెస్ ఫార్ములా ని కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తూ నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాడు. మొన్న వచ్చిన 'సరిలేరు నికేవ్వరు' సినిమాతో అనిల్ స్టార్ హీరోలను సైతం వారి క్రేజ్ కి తగ్గట్టు చూపించగలడని అందరికి ఒక క్లారిటి వచ్చింది. ఇక హీరోలు కూడా అనిల్ మంచి ఫామ్ లో ఉండడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి పెద్దగా ఆలోచించడం లేదు.

Recommended Video

Dil Raju Clarifies On Ravi Teja In F3 Movie | Filmibeat Telugu
మరొక హీరో ఎవరో..?

మరొక హీరో ఎవరో..?

F3 అనగానే మరొక హీరో కూడా ఈ కొత్త సినిమాలో నటించబోతున్నట్లు ముందు నుంచి టాక్ వస్తోంది. డైరెక్టర్ ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇవ్వకపోయినా అది అబద్ధమని చెప్పలేదు. అనిల్ దృష్టిలో అయితే మొదటి నుంచి రవితేజ అయితే బెటర్ అని ఆలోచిస్తున్నాడు. కానీ దిల్ రాజు అందుకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సాయి ధరమ్ తేజ్ అని కూడా టాక్ వచ్చింది. F3 కథ సెట్టయినా ఇంకా మూడో హీరో విషయంపై ఎలాంటి ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోలేదు. మరీ ఆ మూడో హీరో ఎవరు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X