100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న డైరెక్టర్.. అల్లు అర్జున్ ప్రొడ్యూసర్ కి ఓకేనా?

ఒకప్పుడు ఇండియన్ సినిమా దగ్గర హీరోల డామినేషన్ ఎక్కువగా కనిపించేది. ఏదైనా సరే హీరోలకే ఎక్కువ పారితోషికాలు కనిపించేవి. కానీ ఆ హీరోలు సహా సినిమా మొత్తాన్ని భుజాలపై వేసి నడిపించే దర్శకులకి మాత్రం వారి కంటే చాలా తక్కువే రెమ్యునరేషన్ లు వెళ్ళేవి. కాగా ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. ఒక హీరో ఏదన్నా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అంటే ఆయా దర్శకులని కాక పట్టడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.

పైగా యువ దర్శకులు కొత్త కొత్త స్టైల్స్ తో సినిమాలు తెరకెక్కిస్తుండడంతో హీరోలు మాత్రమే కాకుండా నిర్మాతలు కూడా ఆయా దర్శకులకి పెద్ద మొత్తం లోనే ఆఫర్ చేస్తున్నారు. కానీ ఈ ఫామ్ లో కొందరు దర్శకులు మాత్రం ఊహించని రేంజ్ రెమ్యునరేషన్ లు అడుగుతున్నారట. కాగా ఈ తరహాలోనే ఓ యువ దర్శకుడు తన దగ్గరకి వచ్చిన నిర్మాతలకి ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ లు చెబుతూ హడలెత్తిస్తున్నాడట.

director atlee asking 100 crores remuneration from allu arjun producers

కాగా ఆ దర్శకుడు ఎవరో కాదు కోలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అట్లీ. తాను తన కెరీర్ లో చేసిన సినిమాలు పట్టుమని 10 కూడా లేవు కానీ ఇపుడు 100 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టుగా పలు రూమర్స్ వైరల్ గా మారాయి. కాగా తమిళ్ లో 300 కోట్లకి పైగా వసూళ్లు ఉన్న సినిమాలు తనకు ఉంటే హిందీలో షారుఖ్ ఖాన్ తో కలిసి 1000 కోట్ల సినిమా "జవాన్" చేసాడు.

ఇంతే ఇక్కడ నుంచి అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లకి బడ్జెట్ సహా తన రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసాడట. కాగా ఇపుడు అట్లీ రెండు భారీ సినిమాలు చేయనున్నాడు. ఒక బిగ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తుండగా మరొకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయనున్నాడు. మరి వీటిలో ఓ సినిమాకే తాను 100 కోట్లు చెబుతున్నాడని తెలుస్తుంది.

director atlee asking 100 crores remuneration from allu arjun producers

అల్లు అర్జున్ తో సినిమాకి ఛాన్స్ లేదు కానీ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అలాగే కోలీవుడ్ నుంచి కానీ హాలీవుడ్ నుంచి కానీ ఓ స్టార్ తో ప్లాన్ చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసమే అట్లీ ఈ భారీ మొత్తాన్ని చెబుతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా దీనితో ప్రస్తుతం నిర్మాతలు అట్లీతో బేరం తెగ్గొట్టే పనుల్లో ఉన్నారని తెలుస్తుంది. కానీ ఈ యువ దర్శకుడు ఈ రేంజ్ లో అడుగుతున్నాడా అనే మాట మాత్రం ఇపుడు సౌత్ సహా నార్త్ సినీ వర్గాల్లో కూడా మంచి హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇంకో పక్క అట్లీపై కొన్ని కామెంట్స్ కూడా లేకపోలేవు. తన సినిమాల్లో సరైన కథే ఉండదు కేవలం తన టేకింగ్ యాక్షన్ మాత్రం తన సినిమాల్ని కాపాడుతుంది. ఇలాంటి దర్శకుడు 100 కోట్లు డిమాండ్ చేయడం ఏంటి అంత ఇవ్వడం అనవసరం అని నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. మరి చూడాలి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది

Read more about: atlee allu arjun jawan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X