ఇది పక్కా అయితే.. ప్రభాస్ మరో ప్రభంజనమే?, సినిమా ఎవరితోనో తెలుసా?..

Recommended Video

ప్రభాస్ నెక్స్ట్ మూవీ ఎవరితోనో తెలుసా?..

సాధారణంగా ఒక రీజినల్ హీరోను మిగతా రాష్ట్రాల్లో అంతగా పట్టించుకోరు. కొంతమంది హీరోల ముఖం కూడా అక్కడ గుర్తుపట్టరంటే అతిశయోక్తి కాదు. కానీ బాహుబలి పుణ్యమాని ప్రభాస్ రీజినల్ స్టార్ నుంచి అందరూ గుర్తుపట్టే ఫిగర్‌గా మారిపోయారు.

ఇప్పుడు పక్క ఇండస్ట్రీ దర్శకులు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఒకరు ప్రభాస్‌తో సినిమా పట్టాలెక్కించడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. ఇంతకీ ఎవరా డైరెక్టర్?...

 ప్రభాస్‌తో అట్లీ:

ప్రభాస్‌తో అట్లీ:

మెడికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ ఏడాది విడుదలైన మెర్సల్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సామాజికంగాను.. రాజకీయంగాను ఈ సినిమా పెద్ద చర్చనే లేవనెత్తింది.

అంతకుమించి వివాదంగానూ మారింది. చివరికి బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం బంపర్ హిట్ సొంతం చేసుకుంది. ఆ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అట్లీ.. ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారట.

 అప్పట్లోనే చర్చలు:

అప్పట్లోనే చర్చలు:

మెర్సల్ చిత్ర సమయంలోనే దర్శకుడు అట్లీ ప్రభాస్ ను సంప్రదించి.. కథకు సంబంధించిన ఒక లైన్ చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అప్పట్లో ప్రభాస్ బాహుబలి-2 సినిమాతో, అట్లీ మెర్సల్ సినిమాతో బిజీగా ఉండటం వల్ల.. దీనిపై చర్చలు కొలిక్కి రాలేదట.

 కథ తయారుచేసే పనిలో:

కథ తయారుచేసే పనిలో:

ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమాకు సంబంధించి కథ తయారుచేసే పనిలో నిమగ్నమయ్యాడట దర్శకుడు అట్లీ. కోలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం దీని గురించే చర్చ నడుస్తోంది. ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందో రాలేదో తెలియగదు కానీ మొత్తానికి ఆయన మాత్రం అప్పుడే స్క్రిప్టు మొదలుపెట్టేశారట. బహుశా.. మంచి కథతో వచ్చి ప్రభాస్ ను మెప్పించాలనే ఆలోచనలో ఉన్నారేమో!

 వచ్చే ఏడాది?:

వచ్చే ఏడాది?:

ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ నత్త నడకన సాగుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఈ లెక్కన ఆ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుందా? లేదా? అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా పూర్తయ్యేదాకా మరో సినిమాకు ప్రభాస్ సైన్ చేసే అవకాశం లేదు. కాబట్టి.. ఒకవేళ ప్రభాస్ తో సినిమా చేయాలంటే అట్లీ మరో ఏడాది వరకు ఆగాల్సిందే.

 ఊహాగానాలేనా?:

ఊహాగానాలేనా?:

ఎలాగూ ప్రభాస్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు కాబట్టి.. ఆలోపు తాను కూడా మరో హీరోతో సినిమా చేసేయాలని అట్లీ ఫిక్స్ అయ్యాడట. దాని తర్వాత ప్రభాస్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతారని తెలుస్తోంది. చూడాలి మరి.. ఇవన్నీ కేవలం ఊహాగానాలకే పరిమితమవుతాయో.. లేక సినిమా రూపం దాలుస్తాయో!.

హ్యాట్రిక్ విజయాల దర్శకుడు:

హ్యాట్రిక్ విజయాల దర్శకుడు:

రాజా రాణి, తేరీ, మెర్సల్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు దర్శకుడు అట్లీ. అసిస్టెంట్ డైరెక్టర్ గా శంకర్ వద్ద కెరీర్ మొదలుపెట్టిన ఈ కుర్రాడు.. అనతి కాలంలోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీదున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X