షారుఖ్ ఖాన్ సినిమాలో అల్లు అర్జున్ పవర్ఫుల్ రోల్.. మతిపోగొట్టేసేలా ప్రాజెక్ట్ సెట్ చేస్తున్న దర్శకుడు!
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు కూడా ఊహించని స్థాయిలో రాబోతున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది. హీరోలు చాలా వరకు ఇతర హీరోలతో సినిమాలు చేసేందుకు ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక గెస్ట్ రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా హీరోలు ఇతర హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే త్వరలోనే షారుక్ ఖాన్ సినిమాలో కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలలోకి వెళితే..

పఠాన్ తో బిగ్గెస్ట్ హిట్
షారుక్ ఖాన్ ఇటీవల పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యాక్షన్స్ సన్నివేశాలతో పాటు సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించడంతో దేశవ్యాప్తంగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎక్కడ చూసినా ఇప్పుడు పఠాన్ సినిమాకు సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

అందరి ఫోకస్ ఆ సినిమాపైనే..
చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న షారుక్ ఖాన్ కు పటాన్ సినిమా అద్భుతమైన విజయాన్ని అందించింది. అయితే ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు అతని తదుపరి సినిమాలపై కూడా అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం లైన్లో అందరి ఫోకస్ ఎక్కువ గా అయితే జవాన్ సినిమాపైనే ఉంది. అట్లీ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో ఎక్కువగా కోలీవుడ్ ఆర్టిస్టులు హైలెట్ కాబోతున్నారు.

సౌత్ క్యాస్ట్ తో జవాన్
జవాన్ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలి అని షారుక్ ఖాన్ కూడా అనుకుంటున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక రకాల విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పటికే విజయ్ ఒక ముఖ్యమైన గెస్ట్ పాత్రలో కనిపించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ముందుగానే విజయ్ సేతుపతి ఒక విలన్ రోల్ లో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక నాయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

అల్లు అర్జున్ రోల్ కూడా..
ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ క్యాస్ట్ జవాన్ సినిమాలో హైలెట్ అయింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా జవాన్ సినిమాలో ఒక భాగం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక యాక్షన్ బ్లాక్ లో ప్రత్యేకమైన అతిథి పాత్ర కోసం దర్శకుడు అట్లే ఇటీవల అల్లు అర్జున్ ను కలిసినట్లు సమాచారం. అయితే అందుకు అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

పుష్ప 2తో బిజీగా బన్నీ..
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సెకండ్ పార్ట్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఈ మధ్యనే వేగాన్ని పెంచుకుంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ డేట్స్ కోసం అట్లీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా పుష్ప 2కు సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తవుగానే జవాన్ షూటింగ్లో పాల్గొనే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











