Atlee నెక్స్ట్ ప్రాజెక్ట్... Jawan మూవీని మించేలా ఆ హీరోతో సినిమా ప్లాన్
తమిళ దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు తమిళ సినిమాలు తీసి.. క్రేజ్ కొట్టేసిన ఈ కుర్ర దర్శకుడు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తీసి.. ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఇదిలా ఉంటే.. అట్లీ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చింది. అది కూడా టాలీవుడ్ హీరోతో జవాన్ సినిమాను మించేలా పాన్ ఇండియా సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ వివరాల్లోకి వెళితే....
తమిళ దర్శకుడు అట్లీ ఇటీవల బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించగా... దీపీకా పదుకుణె, సంజయ్ దత్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఇక విలన్ గా విజయ్ సేతపతి నటించారు. ఇక ఇందులో ప్రియమణి, యోగిబాబు వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించారు.

జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గౌరీ ఖాన్ 300కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ మూవీ ఇప్పటికే 600కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక 1000 కోట్ల రూపాయలను రాబట్టనుందని ట్రెడ్ అనాలిస్టులు అంచనాలు వేస్తున్నారు. ఇక పఠాన్ సినిమా రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేయనుందని అంతా అంటున్నారు.
ఇదిలా ఉంటే.. అట్లీ నెక్ట్స్ మూవీ అప్టేట్ వచ్చింది. ఇక ఆయన నెక్ట్స్ మూవీ జవాన్ సినిమాను మించి ప్లాన్ చేస్తున్నారు. ఆ హీరో ఎవరో కాదు.. మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వీరి మూవీ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా జవాన్, పుష్ప సినిమాలను మించి ఈ పాన్ ఇండియా సినిమా ఉండనుందని సమాచారం. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ వ్యవహారించనున్నారు.
ఇప్పటికే వీరి కాంబో గురించి మొన్న అల్లు అర్జున్ హింట్ కూడా ఇచ్చేశాడు. అల్లు అర్జున్ 'జవాన్' టీమ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్వీట్ కు అనిరుధ్ స్పందించారు. 'థాంక్యూ మై బ్రో' అని రిప్లై ఇవ్వగా... సింపుల్ గా థాంక్స్ చెప్పడం కాదు... నాక్కూడా మంచి పాటలు ఇవ్వాలన్నారు. దీంతో అల్లు అర్జున్ మూవీకి అనిరుధ్ ఫిక్స్ అయినట్లు అర్థం అవుతోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప2'లో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత సందీప్ వంగ, త్రివిక్రమ్ తో సినిమాలు చేయనున్నారని సమాచారం. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక అట్లీతో మూవీ చేయనున్నారా... లేదా ముందుగానే అట్లీతో మూవీ చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











