AA22xA6 : ఐదుగురు హీరోయిన్లు ఇందుకే.. బన్నీతో అట్లీ ప్లానింగ్ వర్కౌట్ అవుద్దా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ బిగ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో అల్లు అర్జున్ AA22xA6 ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుండటం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైన తర్వాత నుంచి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతూనే వస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడూ ఏదోక అంశం ఆసక్తికరంగా మారుతోంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ తో అట్లీ చేయబోతున్న ఓ భారీ సాహసం గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్ తో AA22xA6..
అల్లు అర్జున్ కెరీయర్ లోనే AA22xA6 భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప : ది రైజ్, పుష్ప 2 : ది రూల్ చిత్రాలతో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో అల్లు అర్జున్ రాబోయే చిత్రంతో మరింత సంచలనంగా మారాలని చూస్తున్నారు. దీంతో సూర్య పిక్చర్స్ బ్యానర్ లో 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో AA22xA6 రూపు దిద్దుకుంటుండటం విశేషం. అల్లు అర్జున్ కెరీయర్ లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపు దిద్దుకుంటున్నది. హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Director Atlee Planning Big with Allu Arjun for AA22xA6 Project

అల్లు అర్జున్ తో అట్లీ సాహసం..
పుష్ఫ : ది రైజ్ చిత్రంతో అల్లు అర్జున్ తన నట విశ్వ రూపం చూపించిన సంగతి తెలిసిందే. అలా వైకుంఠపురం చిత్రం మొదలు అల్లు అర్జున్ నటనకు ప్రశంసలు అందుతున్నాయి. పుష్ప చిత్రంతో ఏకంగా బెస్ట్ యాక్టర్ విభాగంలో నేషనల్ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. ఇక అట్లీ అర్జున్ తో మరో సాహసం చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని టాక్ వచ్చింది. ఇక ఇప్పుడైతే ఏకంగా నాలుగు పాత్రలో అల్లు అర్జునే నటించబోతున్నారంటూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది.

ఇప్పటి వరకు అల్లు అర్జున్ డబుల్ రోల్ లో కూడా నటించలేదు. అలాంటిది ద్విపాత్రాభినయం అంటే అభిమానులు సంతోషించారు. కానీ ఇప్పుడు ఏకంగా 4 నాలుగు పాత్రల్లో అంటే గ్రాండ్ ఫాదర్, ఫాదర్, ఇద్దరు కొడుకుల పాత్రల్లోనూ అల్లు అర్జునే నటించబోతున్నారని స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయ్యింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ అట్లీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అనేది హాట్ టాపిక్ గ్గా మారింది.

ఐదు హీరోయిన్లు ఫైనల్..
అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో ఏకంగా 5 గురు హీరోయిన్లను తీసుకుబోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఫైనల్ చేశారు. అలాగే మృణాల్ ఠాకూర్ ను, జాన్వీ కపూర్ ను, నేషనల్ క్రష్ రష్మిక మందన్నను కూడా ఫైనల్ చేశారు. మరో హీరోయిన్ గా అనన్య పాండే ను కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఐదుగురు హీరోయిన్లూ అల్లు అర్జున్ సరసనే నటించే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Read more about: allu arjun atlee AA22xA6
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X