సురేంద్ర రెడ్డి బ్యాచులర్ పార్టీకి ఆ బ్రహ్మచారి హీరోలు...
ఈ నెల 28న వివాహం చేసుకుంటున్న దర్శకుడు సురేంద్ర రెడ్డి క్రితం రాత్రి బ్యాచులర్ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి టాలీవుడ్ లో బ్రహ్మచారులుగా ఉన్న హీరోలు ఎన్టీఆర్, రాణా, రామ్ అటెండయ్యారు. ఈ పార్టీ హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో చోటు చేసుకుంది. హీరోలంతా లేట్ నైట్ వరకూ బాగా ఎంజాయ్ చేసారని చెప్తున్నారు. ఇక తన ప్రెండ్ సర్కిల్ లోని వారిని, బాగా దగ్గర బంధువులను కూడా సురేంద్రరెడ్డి ఈ పార్టీకి పిలిచారు. ఇక ఈ వివాహం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో వైభవంగా జరగబోతోంది. ముహూర్తం ఉదయం 9.29 గంటలు. పెళ్ళి కూతురు పేరు దీపారెడ్డి. 'అతనొక్కడే' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సురేంద్ర రెడ్డి 'అశోక్', 'అతిథి', 'కిక్' చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన రామ్, జెనీలియా జంటగా 'ఊసరవెల్లి' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జెనీలియా హీరోయిన్ గా ఈ చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











