RC 16: రామ్ చరణ్ కోసం ఆ హీరోయిన్ పై బుచ్చిబాబు ఫోకస్.. సెట్టయితే కాంబో హిట్టే!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్న హీరోయిన్లకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఒక్క బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకున్నా కూడా వెంట వెంటనే అగ్ర హీరోలతో కూడా సినిమాలలో నటిస్తున్నారు. ఇక గత కొంతకాలంగా పూజా హెగ్డే రష్మిక మందన్న ఇద్దరు కూడా తెలుగు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఎక్కువగా వీరికి అగ్ర హీరోలతోనే అవకాశాలు వస్తున్నాయి.
అయితే ఇప్పుడు వారి స్థానాలకు పోటీని ఇచ్చే విధంగా మరి కొంతమంది బ్యూటీలు అడుగుపెట్టారు. ఇక త్వరలోనే రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరపైకి రాబోయే సినిమాకు లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న హీరోయిన్ ను ఫైనల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు సీతారామం బ్యూటీ మృణాల్ అని తెలుస్తోంది. ఈ బ్యూటీ మొదట్లో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అందుకోలేదు. కానీ ఎప్పుడైతే సీతారామం సినిమాలో సీత పాత్రలో కనిపించిందో అప్పటినుంచి కూడా తెలుగు జనాలకు బాగా దగ్గరయిపోయింది.

అయితే కేవలం ట్రెడిషనల్ పాత్రలు మాత్రమే కాకుండా గ్లామరస్ పాత్రలలో కూడా మెప్పించగలనని నిరూపిస్తోంది. ఆమెకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు అందరికీ నచ్చిన ఈ బ్యూటీని దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ ప్రాజెక్టు కోసం ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి రాబోయే ఆ బిగ్ యాక్షన్ మూవీలో మృణాల్ ఠాగూర్ అయితే బాగుంటుంది అని అందరూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు అయితే కొంతమంది పేర్లు వినిపించినప్పటికీ కూడా ఆడియన్స్ నుంచి అంతగా హైప్ రాలేదు. కానీ ఇప్పుడు మృణాల్ అని సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తూ ఉండడంతో మళ్ళీ ఒక్కసారిగా ఆమె పేరు వైరల్గా మారిపోయింది. రామ్ చరణ్ కి జోడిగా తీసుకుంటే తప్పకుండా వర్క్ అవుట్ అవుతుంది అని ఫాన్స్ నుంచి సపోర్ట్ అందుతోంది. మరి ఈ బ్యూటీ నిజంగా రామ్ చరణ్ తేజ్ తో నటిస్తుందో లేదో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











