NBK109 Movie Update: బాలయ్య కోసం కుర్ర హీరోయిన్లను లైన్లో పెట్టారుగా!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలోనే సింగిల్ గా అఖండ సినిమాతో వచ్చి సూపర్ హిట్టును అందుకున్నాడు. ఆ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి.. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లను అందుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...
బాబీతో బాలయ్య మూవీ: బాలయ్య బాబు.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇటీవల బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను భగవంత్ కేసరిగా ఫిక్స్ చేశారు. దానితో పాటు.. ఓ టీజర్ రిలీజ్ చేయగా.. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను పూర్తి చేసి.. దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్. అయితే ఈ సినిమా పూర్తి కాగానే.. బాబీ దర్శకత్వంలో బాలయ్య తన 109వ సినిమా చేయనున్నాడు.

అంచనాలు రెట్టింపు: ఇటీవల బాలయ్య బర్త్ డే సందర్భంగా తన 109వ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం చేశారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 1980 లో స్టోరీతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. వయోలెన్స్ కి విజిటింగ్ కార్డు... ప్రపంచానికి ఇతను తెలుసు, కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అనే కొటేషన్ తో ఇటీవల పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ పోస్టర్ కు మంచి స్పందన వస్తోంది.

ఇంట్రెస్టింగ్ అప్డేట్: ఇక ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ఇద్దరు యంగ్ హీరోయిన్స్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ను బాలయ్య సరసన హీరోయిన్ గా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే సంయుక్త నటించిన అన్ని సినిమాలు హిట్. ఇప్పుడు తనను ఈ సినిమాకు ఎంపిక చేసుకుంటే.. ఈ సినిమా హిట్ అనే భావిస్తున్నారట. అయితే ఈ అప్డేట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సారి బంపర్ హిట్టే: ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య నిర్మిస్తున్నారు. దర్శకుడు బాబీ ఇటీవలే సంక్రాంతికి చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా తీశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. ఇక బాలయ్య కూడా వరుస హిట్స్ మీద ఉండటంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి. చూడాలి ఇక ఈ సినిమా ఏ రేంజ్ హిట్ సాధిస్తుందోనని.


Click it and Unblock the Notifications











