వెండితెరపై మెగాస్టార్ తో పవర్ స్టార్.. అలాంటి పాత్ర కోసం స్టార్ డైరెక్టర్ అదిరిపోయే ప్లాన్

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ప్రపంచంలో మల్టీస్టారర్ సినిమాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోలు ఇతరులతో నటించడానికి చాలా రకాలుగా ఆలోచించేవారు. కానీ కాలం మారుతున్న సమయంలో దర్శకులతో పాటు ఆలోచనలు కూడా ఎంతగానో మారుతున్నాయి. ఇతరులతో వర్క్ చేయడానికి వారు ఏ మాత్రం ఇబ్బంది పడటం లేదు. వీలైనంత వరకు మల్టీస్టారర్ కథలు నచ్చితే వెంటనే ఒప్పేసుకుంటున్నారు. ఇక త్వరలోనే మెగా బ్రదర్స్ కలయికలో కూడా మరొక సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

అలుపులేకుండా షూటింగ్

అలుపులేకుండా షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా ఏ మాత్రం అలుపులేకుండా షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నారు. చాలా కాలం తర్వాత వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. మెగాస్టార్ గతేడాది వరకు కూడా ఒక సినిమా పూర్తి అయితే గాని మరొక సినిమాను లైన్ లోకి తేవడానికి పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ కరోనా గ్యాప్ ను వీలైనంత త్వరగా ఫిలప్ చేయాలని అనుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మన స్టార్ హీరోలు అందరు కూడా రానున్న మూడేళ్లలో ఐదు పైగా సినిమాలను విడుదల చేసే లాగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒకేసారి మూడు సినిమాలు

ఒకేసారి మూడు సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా అనంతరం ఒకేసారి మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు. ముందుగా లూసిఫర్ తో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ అనే మరో సినిమాను స్టార్ట్ చేశాడు. ఇక వీటితో పాటు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ లో కూడా స్పీడ్ పెంచాలని మెగాస్టార్ ప్రణాళికలు రచిస్తున్నారు.

 మెగాస్టార్ సినిమాలో పవర్ స్టార్

మెగాస్టార్ సినిమాలో పవర్ స్టార్

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కనిపించే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే తన కొడుకు రామ్ చరణ్ తేజ ఆచార్య సినిమాలో కలిసి నటించిన అన్నయ్య ఆ తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అడిగితే పవన్ కళ్యాణ్ ఏలాంటి పాత్ర చేయడానికి అయినా సరే ఒప్పుకుంటాడు అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మెగాస్టార్ అవసరం అయితేనే మెగా హీరోలను తన సినిమాల్లో పెట్టుకోడానికి అంగీకరిస్తాడు.

Recommended Video

Chiranjeevi 154 Movie Opening | Director Bobby | MEGA 154
 అలాంటి పాత్రలో..

అలాంటి పాత్రలో..

దర్శకుడు బాబి కథ రాసుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ లాంటి హీరో మెగాస్టార్ చిరంజీవి కి ఒక బ్రదర్ పాత్రలో కనిపిస్తే అద్భుతంగా ఉంటుంది అని అనుకున్నాడట. మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని రోజులు ఆ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ తో కూడా ఆ విషయంపై చర్చలు జరిపారట. అయితే డేట్స్ కుదరక పోతే మాత్రం కాస్త కష్టంగానే అవుతుంది అని తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. నిజమైతే బావుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X