పెరిగిపోతున్న రాంచరణ్ సినిమా బడ్జెట్.. ఊహించని పరిణామాలు!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శత్వంలో నటిస్తున్నాడు. బోయపాటి శైలిలో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రంగస్థలం వంటి భారీ హిట్ తరువాత రాంచరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు బోయపాటి ఈ చిత్రంలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర బడ్జెట్ క్రమంగా పెరిగిపోతోందని ఓ ఆంగ్ల పత్రికలో ఆసక్తికర కథనం వెలువడింది. సినిమా ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా విడుదల కాలేదు.

ఏప్రిల్‌లో మొదలై

ఏప్రిల్‌లో మొదలై

రాంచరణ్ ఈ ఏడాది రంగస్థలం చిత్రంతో విజయం అందుకున్నాడు. రంగస్థలం చిత్రం తరువాత రాంచరణ్, బోయపాటి సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రారంభమైంది. ఇప్పటికి చాలా భాగం షూటింగ్ మిగిలే ఉందని వార్తలు వస్తున్నాయి.

Recommended Video

Pawan Kalyan Super Hit Movie Title For Ram Charan's Movie
 70 శాతమే

70 శాతమే

ఇప్పటివరకు ఈ చిత్ర షూటింగ్ 70 శాతం మాత్రమే పూర్తయిందట. ఇంకా పాతాళ చిత్రీకరణతో కలిపి 30 శాతం షూటింగ్ పూర్తి కావలసి ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా చిత్ర యూనిట్ అక్టోబర్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తవుతుందని భావించినట్లు తెలుస్తోంది. షూటింగ్ నెమ్మదిగా సాగుతుండడంతో ఆసల్యం జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అసంతృప్తిలో చరణ్

అసంతృప్తిలో చరణ్


రాంచరణ్ కూడా షూటింగ్ నెమ్మదిగా జరగడంపై అసంతృపి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ కల్లా పూర్తి కావలసిన షూటింగ్ ఇంకా మిగిలి ఉండడంతో చరణ్ నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. తదుపరి రాజమౌళి చిత్రంతో చరణ్ బిజీ కావలసి ఉంది. ఇప్పటికే రాజమౌళి ఎన్టీఆర్ కు సంబందించిన వర్క్ షాప్ పనులు మొదలు పెట్టాడు. చరణ్ ఇప్పటికి బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు.

 పెరుగిపోతున్న బడ్జెట్

పెరుగిపోతున్న బడ్జెట్

షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో నటీనటులు, సాంకేతిక విభాగం నిపుణులకు సంబందించిన డేట్స్ విషయంలో ఇబ్బందులు మొదలైనట్లు తెలుస్తోంది. ముందుగా ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ అక్టోబర్ వరకు మాత్రమే డేట్స్ కేటాయించారట. కానీ ఆలస్యం జరుగుతుండడంతో ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిగిలిన భాగం షూటింగ్ పూర్తి చేయాలంటే 30 వర్కింగ్ డేస్ అవసరం అని అంటున్నారు. తద్వారా బడ్జెట్ కూడా పెరిగిపోతోందట.

 75 కోట్ల బడ్జెట్

75 కోట్ల బడ్జెట్

ముందుగా ఈ చిత్రానికి 75 కోట్ల బడ్జెట్ లో ఫినిష్ చేయాలని నిర్మాత డివివి దానయ్య భావించారు. చూస్తుంటే ఆ బడ్జెట్ మరింత ఎక్కువయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి విడుదలని ముందుగా ఖరారు చేసుకున్నా సంగతి తెలిసిందే.

భారీ తారాగణం

భారీ తారాగణం

బాలీవడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆర్యన్ రాజేష్, సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవడ్ బ్యూటీ కైరా అద్వానీ రాంచరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X