Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇది బాహుబలి కాదు, బాలయ్య మూవీ.. బోయపాటి కోరికలకు హద్దే లేదు?
యాక్షన్ మాస్ మసాలా సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలకృష్ణ సరికొత్త గెటప్పుల్లో కనిపించబోతున్నాడు అని అన్నప్పటి నుంచి అభిమానుల్లో అంచనాల డోస్ పెరిగింది. అయితే బడ్జెట్ లెక్కలు తగ్గించినా కూడా దర్శకుడు మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు బడ్జెట్ లెక్కలు పెరగడంతో ఇది బాహుబలి మూవీ కాదు.. బాలయ్య మూవీ అనే కామెంట్స్ వస్తున్నాయి.
డిజాస్టర్స్ ఎఫెక్ట్..
బాలకృష్ణ గత సినిమాలు ఎలాంటి రిజల్ట్ ని అందుకున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక మరోవైపు దర్శకుడు బోయపాటి కూడా హిట్టు చూసి చాలా కాలమవుతోంది. అందుకే హిట్ కాంబినేషన్ ద్వారా సక్సెస్ అందుకోవలని చూస్తున్నారు. సింహా - లెజెండ్ సినిమాల తరువాత వీరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో జనాల్లో అంచనాల డోస్ పెరిగింది.
అలా చేయక తప్పదు..
బాలకృష్ణ - బోయపాటి అనగానే ముందుగా వారి మునుపటి సినిమాల కంటే హై రేంజ్ లో ఉండాలని ఆడియెన్స్ కోరుకుంటారు. కానీ బోయపాటి కొన్నిసార్లు అనుకున్న బడ్జెట్ కంటే హై రేంజ్ లో సినిమాను డిజైన్ చేస్తారనే టాక్ ఉంది. మంచి ప్రాడక్ట్ రావాలంటే కొన్నిసార్లు బడ్జెట్ లో నెంబర్లు పెంచక తప్పదు. కానీ సినిమా మార్కెట్ పరిధి కూడా చూసుకోవాలి. అయితే బోయపాటి బాలకృష్ణ సినిమా విషయంలో అలా కాకుండా బడ్జెట్ డోస్ పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
షెడ్యూల్ చేంజ్..
అసలైతే అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక షెడ్యూల్ ని విదేశాల్లో షూట్ చేయాలని అనుకున్నారు. అలాగే హిమాలయాల్లో కూడా షూట్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు విదేశాలకు వెళ్లే ఛాన్స్ లేదు. అందుకే హైదరాబాద్ స్టిడియోలలో భారీ సెట్స్ తో షూటింగ్స్ చేయనున్నారట. లాక్ డౌన్ అనంతరం షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట.
Recommended Video
స్టార్ యాక్టర్ కావాలట..
బోయపాటి శ్రీనివాస్ వీలైనంత వరకు తన సినిమాల్లో పెద్ద స్టార్స్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. వారిని ఉపయోగించుకోవడంలో సిద్ధహస్తుడే అయినప్పటికీ ప్రస్తుతం మార్కెట్ కి తగ్గట్టుగా కాస్త డిఫరెంట్ గా ఆలోచించి వెళితే మంచిదనే టాక్ వస్తోంది. ఇక సినిమాలో శ్రీకాంత్ నెగిటివ్ పాత్రలో నటిస్తుండగా.. మరో బాలీవుడ్ యాక్టర్ ని కూడా విలన్ పాత్రలో చూపించాలని అనుకుంటున్నారట. బాలీవుడ్ సైడ్ వెళితే కాస్త బడ్జెట్ లో లెక్కలు మారే అవకాశం ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.