బాలయ్యకు హ్యాండిచ్చిన బోయపాటి - అల్లు అరవింద్.. పాన్ ఇండియా హీరోను పట్టేశారుగా!
ఇండస్ట్రీలో కొన్ని కాంబోలు ఎప్పటికీ ప్రత్యేకమే. అందులో బాలకృష్ణ - బోయపాటి నెం.1. ఈ ఇద్దరు కలిశారంటే బాక్సాఫీస్‌కు పూనకాలే. ఓవైపు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతూ ఉంటారు.. మరోవైపు వసూళ్లేమో గలగల పారుతుంటాయి. అప్పుడెప్పుడో వచ్చిన సింహా, లెజండ్ నుంచి అఖండ వరకు రిలీజైన చిత్రాలే దీనికి నిదర్శనం. అయితే ఈ సారి బాలయ్యకు హ్యాండ్ ఇచ్చాడు బోయపాటి! నెక్ట్స్ అఖండ 2 చేస్తాడని ఇండస్ట్రీ అంతా కోడై కూస్తే, అభిమానులు భారీ ఆశలు పెట్టుకుంటే ఓ పాన్ ఇండియా హీరోను లైన్లో పెట్టేందుకు రెడీ అయిపోయాడు. దాని గురించి ఈ కథనం..
తెలుగు చిత్రసీమలో ప్రస్తుత తరం పక్కా మాస్ అండ్ యాక్షన్ డైరెక్టర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రంలోనూ యాక్షన్ ఎపిసోడ్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆడియెన్స్‌లో అవి కొన్ని సార్లు భారీ షాక్‌ను కూడా క్రియేట్ చేస్తుంటాయి.

బోయపాటి శ్రీను ఎన్నిచిత్రాలను తెరకెక్కించినా, నటసింహం నందమూరి బాలకృష్ణతో చేసిన చిత్రాలు ఆయన్ను మరింత ప్రత్యేకంగా నిలిపాయి. అయితే ఆయన చివరిగా రామ్ పోతినేనితో స్కంద సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తన కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నారు. అయితే ఆయన తన తర్వాతి సినిమాను సూర్య, అల్లు అర్జున్‌తో చేస్తారని మొదట ప్రచారం సాగింది. కానీ వారిద్దరూ ప్రస్తుతానికి బిజీగా ఉండడంతో వారిని పక్కనపెట్టారట.
అయితే ఆ తర్వాత రీసెంట్గా ఆయన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. కానీ సినిమా వివరాలేమీ తెలుపలేదు. దీంతో హీరో ఎవరై ఉంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే అఖండ 2 కోసం వీరిద్దరూ చేతులు కలిపారని జోరుగా ప్రచారం సాగింది. అల్లు అర్జున్, సూర్య పేర్లు వచ్చినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు అఖండ 2 పేరు బయటకు రాగానే భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇక బాలయ్య బోయపాటి నెక్ట్స్ సినిమా అఖండ 2 అని ఫిక్స్ అయిపోయారు.

కానీ అనూహ్యంగా ఇప్పుడది కాదని కొత్త ప్రచారం మొదలైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నారని టాక్ వస్తోంది. విజయ్‌కు కథ చెప్పేందుకు బోయపాటి సిద్ధం అయ్యారట. ఒకవేళ ఇది కనుక కన్ఫామ్ అయితే ఊహించని మరో కొత్త కాంబో సెట్ అయినట్టే. ఎందుకంటే దేవరకొండ బోల్డ్ అండ్ క్లాస్ హీరో. బోయపాటి ఏమో మాస్ డైరెక్టర్. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ కొత్తగా ఉంటది. చూడాలి మరి ఈ కాంబో సెట్ అయితదో లేదో.
ఇకపోతే విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్లో గీతా గోవిందం చేశారు.


Click it and Unblock the Notifications











