Ram Pothineni పాన్ ఇండియా మూవీ కోసం బోయపాటి బిగ్ ప్లాన్.. రంగంలోకి స్టార్ హీరో!
టాలెంటెడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఎందుకంటే దర్శకుడు బోయపాటి అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని ఆ తరువాత రామ్ పోతినేనితోనే సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యాడు. దీంతో ఈ కాంబినేషన్ పై మాస్ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
దానికి తోడు రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ తో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. అంతేకాకుండా అతనిలో మంచి మాస్ హీరో ఉన్నాడు అని కూడా రుజువయ్యింది. ది వారియర్ సినిమా పూర్తిస్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ అందులోని మాస్ కమర్షియల్ అంశాలు మాత్రం ఓవర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు రామ్ ఎక్కువగా బోయపాటి శ్రీను ప్రాజెక్ట్ పైనే ఫోకస్ చేస్తున్నాడు. ఆ సినిమాలో ఒక పవర్ఫుల్ హీరోగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే బోయపాటి ఈ సినిమా కోసం మరొక అగ్ర హీరోని కూడా రంగంలోకి దింపే ఛాన్స్ ఉందట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ అని కూడా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య బాబు బోయపాటి కోసం గెస్ట్ పాత్రలో నటించడానికి ఒప్పుకుంటాడు అని చెప్పవచ్చు.
ఇక రామ్ పోతినేనికి కూడా ఇది బాగా కలిసి వచ్చే అంశం. మరోవైపు బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా కొత్త సినిమాను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడు. అఖండ సీక్వెల్ కూడా ఉంటుంది అని గతంలోనే ప్రకటించారు. అయితే దానికంటే ముందు బోయపాటి - రామ్ పోతినేని పాన్ ఇండియా సినిమాలో బాలయ్యతో మ్యాజిక్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











