Balayya Boyapati : స్కంద మూవీలో ఆ డైలాగులు... బాలయ్య కోసమే బోయపాటి ఇలా చేశాడా?
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లోకి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది. అయితే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు పర్వాలేదనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో కొన్ని డైలాగులు... ఏపిీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాలా ఉన్నాయి. అయితే అవి బాలయ్య కోసమే ఇలా బోయపాటి పెట్టి ఉంటారని నెట్టంట వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే...
బోయపాటి శ్రీనువాస్, నందమూరి బాలకృష్ణ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బోయపాటి లాంటి దర్శకుడు బాలయ్యకు తగలకపోయి ఉంటే... ఇంత క్రేజ్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే.. బాలయ్యకు వరుస ఫ్లాపులు వచ్చినా... బోయపాటితో సినిమా తీసి హిట్టు కొట్టేవాడు. సింహ, లెజెండ్, అఖండ.. ఇవన్నీ బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కినవే. వీరి కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్. అంతే కాదు.. వీరి మధ్య అనుబంధం కూడా గట్టిదే.

మొన్న స్కంద ప్రీరిలీజ్ ఈవెంటులో బోయపాటి.. బాలయ్య గురించి చెప్పిన మాటలు వింటే... వారి మధ్య అనుబంధం ఎంత గొప్పదో తెలుస్తోంది. అంతే కాదు ఆయన నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా కోసమే... తన స్కంద సినిమాను ప్రీపోన్ చేసుకున్నారని సమాచారం. ఇక ఆ విషయం పక్కన పెడితే.. ఇటీవల బోయపాటి రామ్ కాంబోలో తెరకెక్కిన స్కంద మూవీ థియేటర్లకి వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది.
రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించాగా... సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రిన్స్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 28న థియేటర్లకి వచ్చిన ఈ సినిమా... మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక రెండో కలెక్షన్లు సైతం డీలా పడ్డాయి.

అయితే స్కంద సినిమాలో ఏపీ గవర్నమెంటును ఉద్దేశించి పలు డైలాగులు ఉన్నాయి. రామ్ తో చెప్పిన డైలాగ్స్.. పొలిటికల్ సెటైర్ గా ఉన్నట్లు నెట్టింట హల్ చల్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను టచ్ చేస్తూ.. బోయపాటి కొన్ని డైలాగ్స్ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని అంటున్నారు. రచ్చ రవితో ఉచిత పథకాలు, ఏపీ సీఎంపై ఇండైరెక్ట్ సెటైర్.. లాయర్ సన్నివేశాలు, ఫారిన్ సరుకు, లోకల్ సరుకు బూమ్ బూబ్.. సీమలో కరెంటు రెండు గంటలే.. ఇవన్నీ రామ్ చెప్పిన డైలాగ్స్.

అయితే రామ్ డైలాగ్స్.. ఏపీ రూలింగ్ పార్టీపైనే అని నెటిజన్స్ అంటున్నారు. బాలయ్య కోసమే బోయపాటి ఇలా చెప్పించారని టాక్ వినిపిస్తుంది. ఇక బాలయ్యతో పవర్ ఫుల్ పొలిటికల్ సినిమా తీస్తే బాగుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే బోయపాటి బాలయ్యతో అఖండ 2 అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











