ఉప్పెన సినిమా విజయ్ దేవరకొండతో చేయాల్సింది.. ఎందుకు చేయలేదంటే.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
మెగాఫ్యామిలీ నుంచి రాబోతున్న మరో స్టార్ హీరో వైష్ణవ్ తేజ్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఉప్పెన సినిమాతో రానున్న ఈ హీరోపై మెగా అభిమానుల్లోనే కాకుండా ఇతర సినీ లవర్స్ లో కూడా అంచనాలు భారిగానే పెరుగుతున్నాయి. ఇక మొత్తానికి సినిమా శుక్రవారం గ్రాండ్ గా విడుదలయ్యింది. ట్రైలర్ ప్రమోషన్స్ తోనే సినిమాపై అంచనాలను పెంచడం వలన ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అయితే సినిమాలో వైష్ణవ్ తేజ్ కంటే ముందు విజయ్ దేవరకొండను అనుకున్నారట.

ఆ ఒక్క సాంగ్ తోనే..
సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్క సాంగ్ తోనే దేవిశ్రీప్రసాద్ పవర్ఫుల్ బజ్ క్రియేట్ చేశాడు. .నీ కన్ను నీలి సముద్రం పాటతోనే ఉప్పెనలా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ అంతకు మించి అనేలా బజ్ క్రియేట్ చేసింది. ఓ వైవు ప్రేమ మరోవైపు భయంకరమైన విలనిజం కనిపిస్తోంది.

సేతుపతి పాత్ర హైలెట్..
ముఖ్యంగా విజయ్ సేతుపతి మాత్రం బయపెట్టేలా ఉన్నాడని మొదటి షో నుంచి టాక్ వైరల్ అవుతోంది. అనిపిస్తోంది. ప్రేమ చరిత్రలోనే నిలిచిపోవాలి.. సంతోషంగా భవిష్యత్తులో పిల్లా పాపాలతో ఉంటే దాని విలువ తగ్గిపోతుంది అనేలా విజయ్ సేతుపతి చెప్పిన డైలాగ్స్ ఎన్నో సినిమా కథకు తగ్గట్లు సెట్టయ్యాయని తెలుస్తోంది.

వైష్ణవ్ తేజ్ కంటే ముందు..
ఇక దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో అనేక విషయాలను బయటపెట్టాడు. సినిమా కథను మొదలు పెట్టినప్పటి నుంచి షూటింగ్ చివరి వరకు ఎలా కొనసాగింది అనే విషయాలని అన్నిటినీ కూడా ఇంటర్వ్యూలలో చెప్పేస్తున్నాడు. ఇక వైష్ణవ్ తేజ్ కంటే ముందు ఈ సినిమాకు హీరోగా ఎవరిని అనుకున్నారు అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చాడు.

విజయ్ దేవరకొండతో..
మొదట ఈ కథ రాస్తున్నప్పడు హీరో విషయంలో ఎవరు అనే దానిపై పెద్దగా ఆలోచించలేదట. కానీ ఒకనొక సమయంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను అనుకున్నట్లు బుచ్చిబాబు చెప్పాడు. కానీ ఆ తరువాత వైష్ణవ్ తేజ్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు చెప్పాడు. వైష్ణవ్ తేజ్ ను మొదటిసారి చూసినప్పుడు అతని కళ్ళు బాగా నచ్చయాని అతనైతే ఇంకా పర్ఫెక్ట్ సెట్టవుతాడాని అనిపించిందని చెప్పారు.

విజయ్ తో ఎందుకు చేయలేదంటే..
ఇక విజయ్ దేవరకొండను అనుకున్నప్పుడు ఎందుకు కమిట్ అవ్వలేదు అనే విషయం గురించి మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ రేంజ్ ఇప్పుడు అంతకంతకు పెరిగింది. ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఆయనకు అంచనాలకు తగ్గట్లు కథ సెట్టవ్వదని అనిపించింది.. అని బుచ్చిబాబు వివరణ ఇచ్చారు. ఇక తరువాత వైష్ణవ్ తేజ్ ను తప్పితే మరే హీరోను కూడా ఈ సినిమాకు అనుకోలేదని వివరించారు.

ఎక్కువగా క్లైమాక్స్ సీన్ గురించే..
హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా అయినా కూడా నవారసాలను పర్ఫెక్ట్ గా పండించినట్లు అర్ధమవుతోంది. ప్రేమతో పాటు ఎమోషన్ సీన్స్ లో కూడా పర్ఫెక్ట్ గా చూపించినట్లు టాక్. హీరోయిన్ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. ఎక్కువగా క్లైమాక్స్ సీన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. చూస్తుంటే సినిమా రోటీన్ కథ అయినప్పటికీ మేకింగ్ విజన్ తోనే దర్శకుడు బుచ్చిబాబు పర్ఫెక్ట్ గా తెరకెక్కించినట్లు టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











