ఉప్పెన తరహాలో బుచ్చిబాబు ప్లాన్.. రామ్ చరణ్ సినిమాలో ట్విస్ట్ కోసం..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి ఇదే ఏడాది చివరలో లేదా 2024 సంక్రాంతికి ఆ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక ఫస్ట్ లుక్ టీజర్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

వీలైనంత త్వరగా శంకర్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అలాగే రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలుపెట్టాలి అని రామ్ చరణ్ అనుకుంటున్నాడు. ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా మరొక అప్డేట్ అయితే రాబోతోంది.

Director bucchi babu big plan for ram charan upcoming project

అలాగే కొన్ని పాత్రలకు సంబంధించిన విషయాలలో కూడా రామ్ చరణ్ తేజ్ దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా కథలో వచ్చే ఒక ట్విస్ట్ కోసం ఒక పవర్ఫుల్ నటుడిని తీసుకోవాలని అనుకుంటున్నారు. సెకండ్ హాఫ్ లో ఉండే ఆ క్యారెక్టర్ లో నటించడానికి ఇప్పటికే ముగ్గురి యాక్టర్స్ ను అనుకున్న బుచ్చిబాబు ఫైనల్ గా విజయ్ సేతుపతి వైపు ఫోకస్ చేస్తున్నట్లుగా కూడా ఒక టాక్ వినిపిస్తోంది.

ఇదివరకే బుచ్చిబాబు ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నటించాడు. ఇక రామ్ చరణ్ తో చేయబోయే కథలో కూడా కాస్త నెగిటివ్ షేడ్స్ కూడా ఉండడంతో విజయ్ సేతుపతి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అని రామ్ చరణ్ కూడా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే బుచ్చిబాబుకు ఇంకా విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం అతను మిగతా సినిమా షూటింగ్లతో చాలా బిజీగా ఉన్నాడు. మళ్ళీ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతే ఇబ్బంది అవుతుంది అని కాస్త సమయం తీసుకున్న తర్వాత ఏదో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X