Krithi Shetty New Movie: నక్కతోక తొక్కిన కృతిశెట్టి.. మళ్లీ అతనే దిక్కేయ్యాడుగా!

ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కృతి శెట్టి. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 100 కోట్లకు పైగా వసూలు చేసి.. సెన్సెషన్ సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె ఫేట్ మారుతుందని అంతా అనుకున్నారు. కానీ వరుస ఫ్లాప్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు హిట్ ఇచ్చిన దర్శకుడే ఆమెకు దిక్కు అయ్యాడు. రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆ వివరాల్లోకి వెళితే....

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన మూవీ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్ గా మెరిసింది. ఈ సినిమాలో బేబమ్మగా తన యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమాలు కూడా మంచి గుర్తింపును తెచ్చాయి. ఆ తర్వాత చేసిన దాదాపు అన్ని సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. రామ్ తో వారియర్, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

Director Buchibabu wants to cast Kriti Shetty as heroine in RC 16 movie

ఇక నాగచైతన్యతో ఇటీవల కస్టడీ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా విజయం సాధించలేకపోయింది. వరుస ఫ్లాప్స్ తో సతమవుతున్న కృతికి.. తనకు సక్సెస్ ఇచ్చిన దర్శకుడే దిక్కు అయ్యాడు. రామ్ చరణ్, బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ అనుకున్నారు. కానీ ఏమైందో తెలీదు.. ఇప్పుడు కృతి శెట్టి పేరు వినిపిస్తోంది.

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కృతి శెట్టి అయితే బాగుంటుందని బుచ్చిబాబు అనుకున్నారట. ఈయన నిర్ణయంపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలే ఫ్లాపులు.. ఎందుకు ఆమెను సెలెక్ట్ చేస్తున్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఉప్పెనలో కీలకపాత్ర పోషించిన విజయ్ సేతుపతి ... ఈ సినిమాలో కూడా నటించబోతున్నాడు. దీనితో ఉప్పెన 2 తీస్తున్నారా ఏంటి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Buchi Babu krithi shetty

ఇక ఆర్సీ 16 విషయానికి వస్తే... ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్నట్లు ఇదివరకే ప్రచారం జరిగింది. అయితే ఇందులో హీరో స్పోర్ట్స్ మ్యాన్. చిన్న గ్రామం నుంచి మొదలైన అతని ప్రస్థానం.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటాడు. అయితే విలన్ వల్లో హీరో హ్యాండిక్యాప్డ్ గా మారుతాడు. తన ఆశయాన్ని ఎలా సాధించాడు అనేదే కథ. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో ఆర్‌సీ16 మూవీ రూపొందనుంది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రానుంది. ఈ సినిమా చిత్రీకరణలో రామ్‍చరణ్ త్వరలోనే పాల్గొననున్నాడు. సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలవుతుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X