నటిని ముద్దు పెడుతూ దొరికిపోయిన డైరెక్టర్?

By Pratap

నటిని ముద్దు పెడుతూ దర్శకుడు రత్నజ దొరికిపోయాడు. రానున్న రెండు సినిమాల్లో అవకాశం ఇస్తానంటూ ఆశ పెట్టి ఆమెను అతను ముద్దు పెట్టుకున్నాడట. దర్శకుడు నటిని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు బయటకు వచ్చాయి. వాటిని బ్లాక్ మెయిలర్లు బయట పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఫొటోల కోసం దుండగులు కోటి రూపాయలు డిమాండ్ చేశారట. అ డబ్బులు అందకపోవడంతో ఆ రహస్యాన్ని బట్టబయలు చేసినట్లు చెబుతున్నారు. అమూల్య అనే అమ్మాయిని ముద్దు పెడుతున్న ఫొటోలను వారు బయటపెట్టారు. ఆ ఫొటోలు నెట్ లో కూడా దర్శనమిచ్చాయి. వారి వద్ద ఓ నిమిషం వీడియో కూడా ఉన్నట్లు గాంధీనగర్ వర్గాలు చెబుతున్నాయి. బెల్గాంలో ఆ ఫొటోలు తీసినట్లు తెలుస్తోంది. గత సెప్టెంబర్ లో షూటింగ్ సందర్భంగా ఇది జరిగినట్లు చెబుతున్నారు. అయితే చిత్రాలను మార్ఫ్ చేశారని అమూల్య తల్లి విజయలక్ష్మి అంటోందని సమాచారం.

ఆ చిత్రాలు తనను షాక్ కు గురి చేశాయని అమూల్య అంటోంది. తానేమీ చెప్పలేని స్థితిలో ఉన్నానని ఆమె అంటోందట. రత్నజతో తాను టచ్ లో లేలని చెబుతోంది. అటువంటి పనులు చేయాల్సిన అవసరం తనకు లేదని చెబుతోంది. చెలువిన చిత్తర తర్వాత తాను 40 సినిమాలను కూడా వదులుకున్నానని చెప్పింది. తాను ఆ సయమంలో బెల్గాంలో ఉన్నానా, లేదా కూడా చెప్పలేకపోతున్నానని అంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X