ముగ్గురు వెధవలతో సూర్య ఇమేజ్ పాడవుతోందని గగ్గోలు...
హిందీలో రూపొందిన 'త్రీ ఇడియట్స్" చిత్రం తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తమిళ వెర్షన్ లో విజయ్ హీరోగా నటిస్తున్నాడు. రెండు భాషల్లోనూ ఇలియానా కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ ముగ్గురు వెధవల సినిమాలో దర్శకుడు యస్ జె సూర్య ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో అతని సరసన అనూయ నటించనుంది. విజయ్ స్నేహితులుగా జీవా, శ్రీరామ్ నటిస్తుండగా సత్యరాజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. తెలుగు వెర్షన్ లో మొదట మహేష్ అని తర్వాత గజిని సూర్యని కన్ఫామ్ చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఇందులో నుండి సూర్య తప్పుకోవడంతో తిరిగి మహేష్ బాబు నటింపజేస్తున్నారు.
కాగా తమిళ హీరో సూర్య మొదట్లో '3 ఈడియేట్స్' రీమేక్ లో నటిస్తానని చెప్పి మళ్లీ ఎందుకు డ్రాప్ అయ్యాడు? ఇప్పుడిదే కోలీవుడ్ లో హాట్ టాపిక్! అందరూ చెప్పుకునేదేమిటంటే, ఆ సినిమాలో తను నటించేందుకు గాను పారితోషికంగా 8 కోట్ల రూపాయలతో బాటు, ఆ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ లో 50 శాతం వాటా కావాలని డిమాండ్ చేసాడట. తెలుగు రైట్స్ అంటే ఎంతలేదన్నా పది కోట్లు వుంటాయి. అంటే, అందులో 5 కోట్లు, ప్లస్ 8 కోట్లు, మొత్తం 13 కోట్లు అడిగాడట. దాంతో దర్శక నిర్మాతలకి కళ్ళు తిరిగిపోయాయట. 'అంత ఇవ్వలేం బాబూ, చేస్తే చెయ్, లేకపోతే లేదు" అని తేల్చి చెప్పేయడంతో, సూర్య ఆ ప్రాజక్టు నుంచి తప్పుకున్నాడని కోలీవుడ్ అంతా కోడై కూస్తోందిప్పుడు. ఈ వార్త ఇప్పుడు సూర్యా దృష్టికి కూడా వెళ్ళిందనీ, ఈ ప్రచారం వల్ల తన ఇమేజ్ పాడవుతోందనీ వాపోతున్నాడట. దాంతో త్వరలో మీడియాకు వివరణ ఇవ్వనున్నాడనీ, డేట్స్ సమస్య వల్లే ఆ సినిమా నుంచి తప్పుకున్నాననీ చెపుతాడని కోలీవుడ్ సమాచారం.


Click it and Unblock the Notifications











